దత్త లీలా క్షేత్ర మహత్యం
శ్రీ వాసుదేవ లీలా మృతం
రచన; శ్రీ రంగావధూత
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
Part-56
వాసుదేవనంద సరస్వతి స్వామి పవని లో చాతుర్మాస్య దీక్ష చేసేటప్పుడు ఒకరోజు గాండా బువా స్వామి మహరాజ్ కి కుంకుమ పూజ చేసుకున్నారు.గాండా బువా స్వామి కి అనన్య సేవ చేసిన ఉత్తమ భక్తులు. వీరికి తన గురువు పట్ల అమిత ప్రేమ,చాలా గౌరవం, అమిత వినయంగా ఉండేవారు.దించిన తల గురువు ముందు ఎత్తేవారు కాదు. గాండా బువా స్వామి మహరాజ్ ని పూజించుకోవడం థట్టే అనే భక్తులు కూడా స్వామి కి కుంకుమ తో పూజించుకున్నారు.ఇలా రోజు అందరూ తమ గురువు అయిన స్వామి మహరాజ్ కు ఎదో వారికి తోచినవిధంగా పూజించడం మొదలుపెట్టారు. దానితో స్వామి మహరాజ్ కి నిత్య కార్యక్రమంలో ఇబ్బంది ఏర్పడింది.దానితో గాండా బువా కి స్వామి ఇబ్బంది పడుతున్నారు అని కోపం వచ్చి
థట్టే గారి మీద కోపంతో అందరి ముందు గట్టిగా అరిచారు.శ్రీ థట్టే గారు చాలా బాధ అనిపించింది. లోపల చాలా బాధ పడ్డారు.ఆ రోజు రాత్రి కి స్వామి గాండా బువా కి స్వప్నం లో కలిపించి పెద్ద గొంతు తో అరచినట్లు మాట్లడుతూ ఎవ్వరి మనస్సు బాధ పెట్టకండి,దుఃఖ పెట్టకండి,పెద్ద గొంతు వేసుకొని అరవడం కాదు,అలా అరిచారో జాగ్రత్త!భక్తుల ప్రేమ,ఆప్యాయత, పవిత్ర హృదయం, శ్రద్ద ని చూడాలి. అని స్వప్నం లో స్వామి గాండా బువా చెంప మీద కొట్టారు.గాండా బువా గారు ఉదయం లేచి చూసినప్పుడు నిజంగానే వారి చెంప వాచింది. బువా గారు అక్కడే ఉన్న దుర్గా మాయి ని అడిగారు.ఆమె స్వామి కి క్షమాపణ వేడుకోమని తెలుపగా వీరు స్వామిమహరాజ్ ని క్షమాపణ వేడుకోగానే చెంప వాపు తగ్గింది.
ఈ సందర్భంలో మనం తెలుసుకోవలసినది ఒక మహనీయుల సేవ కొద్దిమంది భక్త్తులకు మాత్రమే పరిమితం కాదు,ఒక భక్తుని మనోభావాలు అతను చేసే సేవ ధర్మ బద్ధం అయితే మనోభావం దెబ్బ తింటుంది.
No comments:
Post a Comment