Thursday, 5 November 2020

శ్రీ నృసింహ వాడీలో వాసుదేవానంద సరస్వతి స్వామి ఉన్న రోజుల్లో వారి దత్త సేవ.

 శ్రీ నృసింహ వాడీలో వాసుదేవానంద సరస్వతి స్వామి ఉన్న రోజుల్లో వారి దత్త సేవ.

దత్త లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:శ్రీ రంగావధూత

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


శ్రీ నృసింహ వాడీలో వాసుదేవానంద సరస్వతి స్వామి ఉన్న రోజుల్లో వారి దత్త సేవ.

Part-45

వక్రతుండ కవీశ్వర్ గారి మనుమడు శ్రీ దత్త మహరాజ్ కవీశ్వర్ గారు కూడా మహనీయులు. వీరు శ్రీ గుళవణి మహరాజ్ గారి, వాసుదేవ నివాస్ కి వారి తరువాత పీఠాధిపతిగా వున్నారు. శ్రీ దత్త మహరాజ్ కవీశ్వర్ గారు, తరువాత గాంధీ నగర్ లో దత్త మందిరం లో దత్త విగ్రహం ప్రతిష్ఠ చేశారు.

తరువాత స్వామి ఉపన్యాసం మొదలు అయ్యేది. అలా ఉదయం 10 గంటల వరకు జరిగేది. తరువాత భక్తులు అందరూ శ్రద్దగా వాసుదేవానంద సరస్వతి స్వామికి పూజ చేసేవారు. పూజలో దక్షిణాది బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు. అప్పటి దాకా వచ్చిన టెంకాయలు,పండ్లు స్వామి స్వయంగా భక్తులకు దత్త ప్రసాదం క్రింద ఇచ్చేసేవారు. పండ్ల పై ఎవరైనా స్వామి వారికి ధనం, దక్షిణ కింద పెడితే స్వామి అక్కడ పూజరులతో వీటి మీద ఆ వ్యర్థం ఎందుకు పెట్టారు అని అడిగి ముట్టుకునేవారు కాదు. వారు జీవితంలో డబ్బు ముట్టుకోలేదు.

తరువాత ఈ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూర్తిఅయ్యేది.

తరువాత వాసుదేవానంద సరస్వతి స్వామి ఐదు ఇళ్లలో గ్రామంలోకి భిక్షకి వెళ్లేవారు.

ఆ భిక్ష ఇచ్చే ఇళ్ల వాళ్ళు స్వామి రాకకై ఎదురు చూస్తూ, వారి ముంగిట చిమ్మి,.ముగ్గులు పెట్టి స్వామి రాకకై ఎదురు చూసేవారు(అదృష్ట వంతులు). స్వామి భిక్ష గ్రహించి, అది తినడానికి నారాయణ మఠం గాని,బ్రహ్మానంద స్వామి మఠమున కు కానీ వెళ్లేవారు." అష్ట గ్రాసా మనోభిక్ష"స్వామి మహరాజ్ దినచర్య ఇలా ఉండేది. ఎప్పుడూ ఖాళీగా ఉండేది లేదు. ఎప్పుడూ దత్త సేవ,జనుల సేవ మాత్రమే. భిక్ష స్వీకరించి వచ్చేటప్పుడు తనకు ఎవరైనా నమస్కారం చేసిన,రజస్వల అయిన మహిళ కనపడిన ఆ రోజు వారు ఉపవాసము ఉండేవారు. అది వారి నియమము. అందుకే భక్తులు స్వామి కన్నా ముందు వెళుతూ అందరింని హెచ్చరించేవారు. 

శ్రీ రంగావధూత రచించిన శ్రీ వాసుదేవ లీలామృతం పుస్తకం లోనిది.

తెలుగు అనువాదం; రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

No comments:

Post a Comment