శ్రీ దత్త లీలా క్షేత్ర మహత్యం-3








మహాత్ముల పరిచయం-210


జననం కానీ,తల్లిదండ్రుల వివరాలు తెలియదు.నృసింహ సరస్వతి స్వామి సమకాలికులు. పుట్టుకతోనే దత్త భక్తులు.స్వయంగా యోగ సాధన,తపస్సుచేసి దత్తాత్రేయ దర్శనం కోసం తపిస్తుంటే శ్రీ దత్తత్రేయ స్వామి త్వరలో నృసింహ వాడి వస్తాను అక్కడికి రా అని అజ్ఞాపిస్తారు. వీరు త్వరగా వాడి చేసి కృష్ణా నది వడ్డు న స్వామి రాకకై ఎదురు చూస్తూ పంచాగ్ని అనే కఠోర సాధన,తపస్సు చేస్తూ ఉన్నారు.శ్రీ నృసింహ సరస్వతి స్వామి అక్కడకు రావడంతో వీరు వారిని గుర్తించి అనన్య సేవ చేసి,సత్ శిష్యులు అని అనిపించుకున్నారు.స్వామి వీరితో మీకు చేసే పూజలు అన్ని నాకు చెందుతాయి అని వరం ఇస్తారు. మీ ఆశీస్సులతో నాకు అన్ని లభిస్తాయి.ఇంక నాకు భయం లేదు అని స్వామి కి నమస్కరిస్తారు.తర్వాత స్వామి ఆజ్ఞ పై అక్కడే మఠంకు పడమర వైపు మారుతి ఆలయం వెనుక సజీవ సమాధి అయ్యారు.ఇప్పడికి పూజలలో వీరికే అగ్రస్థానం. వీరి సమాధి పై శివలింగం ఉంది.ఆ శివలింగం ని వేసవిలో పెరుగు అన్నం తో అభిషేకం చేస్తారు. అక్కడే అశ్వద్ధ వృక్షం ఉంది.ఓం శ్రీ సాయిరాం.
No comments:
Post a Comment