Saturday 28 November 2020

మహాత్ముల పరిచయం-.... పద్మనాభచార్య స్వామి/పద్మపాద చార్య...🙏🏻

 


మహాత్ముల పరిచయం-386....

పద్మనాభచార్య స్వామి/పద్మపాద చార్య...🙏🏻

Rajyalakshmi Srinivas Boddupalli

ఉమాబాయి, రఘునాధ్ స్వామి దంపతులకు 1849 సంవత్సరం లో జన్మించారు. తుంగభద్ర నదీ తీరంలో దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయులు.

త్రివేది బ్రహ్మణ కుటుంబం లో జన్మించిన వీరు చిన్నప్పుడు సంస్కృతంతో పాటు అనేక భాషలు మాట్లాడేవారు. తరువాత  గురువు అయిన యశ్వంత్ మహరాజ్ దగ్గర ఉపదేశం పొంది,దీక్ష  తీసుకున్నారు. గురువు ఆజ్ఞ పై 4 వర్ణాలవారికి అర్ధం అయ్యేలా ధర్మ బోధ చేయడం తన లక్ష్యం గా పెట్టు కున్నారు. వీరు 

జాతవేద మహవాక్య గ్రంధం,వేదాంత కౌముది,హరి పాట్,శుభేదా భజన మాలిక వంటి గ్రoధాలు అందరికి అర్ధం అయ్యేలా రచించి కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ లలో  పర్యటించి ప్రజలకు జ్ఞానబోధ చేసారు.   వీరు ఉన్న చోట దత్త  మందిరాలు కట్టించేవారు. అక్కడ ఒక ఆచార వ్యవహారాలను, పద్ధతి ప్రవేశపెట్టి ప్రజలను ఉద్ధరించారు.

అనేకమందిని ఆధ్యాత్మిక చర్చలలో ఓడించి, ఆధ్యాత్మిక మార్గంలో కి తీసుకొచ్చారు. కష్ట జీవులలో ఎక్కువగా ఉంటూ,వారిని ధర్మ మార్గం వైపు నడుపుతూ మద్యపానం, ధూమ పానం,అనాగరిక పనులు మానిపించేవారు. వారిని దత్త భక్తులు చేసి,ఆధ్యాత్మికంగా మార్గ నిర్దేశం చేశారు. ఎక్కువగా తుంగభద్ర నదీ ప్రాంతంలో వీరిచే ఉద్ధరించబడిన సంప్రదాయం కనపడుతుంది.అందరితో "జయ సచ్చిదానంద" మంత్రంతో భజనలు చేయించేవారు. జ్ఞాన ప్రచారం చేసేవారు. ఇప్పటికే వీరు రాసిన భజనలు తుంగభద్ర నది తీర గ్రామాల్లో వినపడుతున్నాయి.చివరకు పాలగరణాజిక్ అనే  కొండ పై 26-జనవరిలో/1912 సంవత్సరం లో వేలాదిమందిని దత్త సంప్రదాయం లోకి మళ్ళించి సమాధి చెందారు.

No comments:

Post a Comment