Thursday 19 November 2020

గురుచరిత్ర గుప్త భావం అధ్యాయం-41-47

 దత్త లీలా క్షేత్ర మహత్యo

గురుచరిత్ర
గుప్త భావం
అధ్యాయం-41-47
మనలో వివేక, వైరాగ్యము ఎక్కువ అయి, సద్గురువు సర్వ వ్యాపకం అనే భావన దృఢ పడి, పరమాత్మ నిర్గుణ, నిరాకారుడు అనే భావన కలుగుతుంది. తాను మొదటిలో సంకిoచినందుకు అపరాధ భావన మొదలు అయి, అది ఎంతటి పాపమో, భగవంతుని ప్రేమ తత్వం తెలుసుకొని ,అనుభవించడం ,భగవంతుడు ఆత్మ స్వరూపం కనుక తాను కూడా వారిలో లయం అవడమే ఈ సాధన యొక్క చివరి మజిలీ అని అర్ధం అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ భగవంతుని స్వరూపం గా కనపడుతోంది. ఆ భగవంతుడు డే మన గురు రూపంలో ఉంటూ,మార్గదర్శనం అయ్యారు కాబట్టి ఇక అన్యమైనది అంతా మిధ్య,వ్యర్థం అని స్పురణ కు వస్తోంది. ఇంకేమి కావాలి,ఆ భగవంతుడు మన లను ఎలా ఉండాలి అని కోరుకున్నాడో మనం అలా తయారు అవుతున్నాము కాబట్టి ఇక వారి కృప కోసం సాధన కొన సాగగిస్తూ ఎదురు చూడటం నే తరువాత.సాధన లో దాదాపు చివరి స్థితి కి వస్తున్నట్లు. ఇప్పటికే కామ, క్రోధ,లోభ,మోహ,మద, మాశ్చర్యం లనే 6 అవిషడ్వర్గాలు జయించి అనసూయ తత్వం ఈ శరీరం లోకి ప్రవేశించింది.ఇవే కాక సమస్తం దత్త మాయం గా కనపడటం వల్ల వీటికి కారణం అయిన అసూయ ని జయించి అనసూయ తత్వం మనలో ప్రేవేశ పెట్టుకున్నాము.ఇక కావలసినది అత్రి తత్వం .
జై గురు దత్త

No comments:

Post a Comment