Tuesday, 3 November 2020

దత్తావతారము

 బ్రహ్మ విష్ణు మహేశ్వర సమైక్య రూపమే దత్తావతారము .అది త్రిమూర్తుల సమానిత్వం .

వారి వరప్రభావము వల్ల అత్రి అనసూయల దంపతులకు దత్తుడు జన్మించాడు .దత్తం అంటే
ఇవ్వడం .అత్రికుమారుడు కాబట్టి ఆయనను
"ఆత్రేయుడు "అని పిలుస్తారు .దత్తాత్రేయుడు
తపస్సు చేసి పరిపూర్ణ జ్ఞానార్జన చెసాడు .ఇరవై
నలుగుర్ని తన గురువులుగా భావించాడు .
కార్త్యవీరుడు ,పరశురాముడు ,యదువు ,అలర్కుడు ,ప్రహ్లాదుడు వంటి అనేకమందికి అధ్యాత్మిక
విద్యను బోధించాడు .అవధూత గీత ,జీవన ముక్త
గీత ,అవధూతోపనిషత్ అని గ్రంథాలు రచించాడు .దత్తుడు మహత్ముడు .ఆయనే అది గురువైన పరబ్రహ్మము .శిష్యకోటి హృదయాలలో
అఖండ జ్ఞానదీపము వెలిగించిన వైరాగ్యరూప
విలక్షణ మూర్తి .ఆయన చుట్టూ ఉన్న నాలుగు
ప్రాణులే నాలుగు వేదాలు .అహంకారాన్ని దండించడానికే దండము ధరించానని ,జోలె పట్టింది భక్తుల సంచిత కర్మల కోసమేనని
ప్రవచించాడు .దత్తాత్రేయ బోధలు లోక కల్యాణ
కారకాలు .భూమి నుంచి సహనశీలత ,గాలి నుండి స్వేచ్ఛ ,ఆకాశమునుండి నిస్సంగత్వం
స్వీకరించాలని ఉద్బోధించారు .అగ్ని నుండి
నిర్మలత్వాన్ని ,సముద్రజలం నుండి గాంభీర్యాన్ని
కపోతం నుండి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నారు
అప్రయత్నంగా వచ్చే అహారాన్ని మాత్రమే
మానవులు స్వీకరించాలి .కొండచిలువలాగా
భ్రాంతి వలలో పడకూడదు .స్పర్శానందానికి
దూరముగా ఉండటం ఏమిటో మిడతను చూసి
తెలుసుకోవాలి .ఏనుగు నుంచి పట్టుదల ,చేప నుంచి త్యాగచింతన అలవర్చుకోవాలి .చీమలా
జిహ్వచాపల్యానికి లోను కారాదు .అప్పుడే
సుఖానికి మూలము అవగతమవుతుందని
దత్తాత్రేయుడు ప్రబోధించాడు .

No comments:

Post a Comment