Thursday, 5 November 2020

శ్రీ గురుచరిత్ర.... గుప్త బోధ. రాజ్యలక్ష్మి ప్రధమ అధ్యాయం🙏🏻

 దత్త లీలా క్షేత్ర మహత్యం...

        శ్రీ గురుచరిత్ర....

గుప్త బోధ.

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

ప్రధమ అధ్యాయం🙏🏻

ప్రధమ అధ్యాయం ఏమి చెపుతోంది?

మన జీవిత చరిత్రయే ఇది.

. ఈ మాయ ప్రపంచంలో చీకటిలో ఉన్నది లేనట్టు-లేనిది ఉన్నట్లు,శాశ్వత మైనది అశాశ్వతమైనదిగా-అశాశ్వతమైన ది,శాశ్వతంగా భ్రమ పడతాము.


మసక చీకటిలో త్రాడు చూసి పాము అనుకోని భయపడి,తరువాత తాడు అని తెలుసుకొని భయం పోగొట్టుకుంటాము.అలాగే ఈ మాయా ప్రపంచంలో మనమే భగవత్ స్వరూపం అయినా, ఈ మాయ వల్ల

భయపడి,మనమే ఆత్మస్వరూపo అని తెలుసుకొని.భయం పోగొట్టుకుంటాము.


ఒక సామాన్యమైన మానవుడి(మనమే) జీవిత మార్గదర్శిగా గురుచరిత్ర ను చూడవచ్చు.మోక్షం పొందాలి అనుకునే వారు గురువు అనుగ్రహం పొందాలి. ఎలా పొందాలి?ఆ అనుగ్రహం మనకు ఎప్పుడు లభిస్తుంది?అసలు ఈ సాధన చాలా?ఇంకా ఏమైనా  సాధనాలు చేయాలి నా?


మనం పూజలు చేస్తుంటాము.భగవంతుడు పలకడు, ఎందుకు పలకడో తెలియదు, ఎప్పుడు పలుకుతాడో తెలియదు, యాంత్రికంగా పూజలు చేస్తుంటాము. అసలు ఉన్నాడో, లేడో మన పూర్వీకులు అందరూ కాలం వృధా చేసుకున్నారా?ఒకవేళ ఉంటే ఎలా ఉంటాడు?అనేక సందేహాలు, ప్రశ్నలకు సమాధానం వెతకడం కోసం నామధారకులు (మనమే,జన్మించిన తరువాత ఎదో ఒక పేరు ధరించాలి కదా  ) బయలు దేరుతారు.

ఉన్నాడా?లేడా?అని కోపం, ఉక్రోషంతో అయోమయంలో వెతుకుతూ ఉంటాము. వాటి లో నించి ఆర్తి మొదలవుతుంది. పట్టుదల పెరుగు తుంది.అదే ఆర్తితో మన లాగానే  బయలుదేరిన నామధారకుడు గురు దర్శనం కలుగక అలసిపోయి నీ మీద   గోత్ర ఋషులకు ఫిర్యాదు చేస్తాను అంటూ తెలియకుండానే భగవంతుడు వున్నాడు అన్న నిర్ణయానికి   వచ్చాడు. వున్నాడు అని మనస్సు లోకి వచ్చింది అంటే భగవంతుడు ఉండబట్టే కదా ఫిర్యాదు చేస్తాను అన్నాడు. దానితో సద్గురువు  మనస్సు కరిగింది. ఆవు దూడ దగ్గరకు ఆవు వచ్చినట్లు పరుగున గురువు అయిన సిద్ధులు స్వప్న దర్శనం ఇస్తారు. మేలుకొని ఆనందంగా తన గురువు దొరికాడు కాబట్టి వారిని సశరీరంగా దర్శించుకోవడానికి ముందుకుసాగారు. అలాగే మనకు అలాంటి సద్గురువు  దొరకాలని  ఆర్తి తప్పక సద్గురువుని చూపుతుంది. అదే మొదటి అధ్యాయం వివరిస్తుంది.గురుసేవ,గురువు మహత్యం, గురువు  మోక్షం కు  ఎంత ముఖ్యం మో కథల రూపంలో తెలియ జేయ బడినది.గురుచరిత్ర, జ్ఞాన,కర్మ,ఉపాసన(భక్తి)

కాండలు గా రచించారు శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి.

జై గురు దత్త

No comments:

Post a Comment