Saturday, 28 November 2020

దత్త దర్శనం:

 దత్త దర్శనం

తెలుగు సరళం:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

నైమిశారణ్యం లో ఆధ్యాత్మిక ఉన్నతస్థితిలో ఉండే ఋషులు,మునులు ప్రజలకు కావలసిన ధర్మాలు,వ్రతాలు,వాటి నియమాలు తెలుపు సూతమహా ముని సమక్షంలో కూర్చుని శ్రీ వాసుదేవుని ధ్యానిస్తూ ఏకాగ్రచిత్తులు అయ్యారు. గాలి లేనప్పుడు ఉండే నీటి వలే కదలక  ఆధ్యాత్మిక తాదాప్యంలో ఉన్నప్పుడు పరిమళ సుగంధముల చిరుగాలి వీచింది. ఆ గాలితో పాటు సమస్త విశ్వమును ప్రకాశింప చేస్తూ కొన్ని కోట్ల సూర్యులు ఉదయించినట్లు తేజస్సు కనపడింది. తరువాత మునులకు మంగళ వాద్యముల ధ్వనులు వినపడ్డాయి. ఆ తేజస్సును చూడలేక మునులు కన్నులు మూసుకొని కూర్చుని, బంగారు గని దొరికినను చేజిక్కించుకోలేని దురదృష్టవoతునివలే ఎదురుగా కనపడుతున్నా కూడా చూడలేక పోతున్నామని ప్రార్ధిస్తున్నారు. అప్పుడు మేఘ ధ్వని వంటి వాక్కు వినపడి కళ్ళు తెరవమంది. వారికి అనంతుడు అను శ్రీ దత్తమూర్తి కనిపించారు. ఆ మునులు స్వామిని చూడగానే ఎలా ఉన్నారో స్తుతించారు.

1.దేవదేవం మహాత్మానం ! పరమానంద విగ్రహం!

విశ్వరూపం మహాభాగం! విచిత్రామలవర్చసమ్ !

భావము::🙏 దేవదేవుడు, మహాత్ముడు, ఆనందమూర్తి, విశ్వరూపుడు, చావు పుట్టుకలు లేక, సాటిలేని కీర్తిని కలిగినవాడు( మహాభాగుడు) అయినటువంటి దత్త దేవుని చూచిరి.🙏

2.తేజోమండలమధ్యస్థం ! ఉద్యంత మివ భాస్కరం!

త్రివర్ణం త్రియుగం త్రంశ్యం! త్రిగుణేశం త్రయీమయం॥

భావము:: తేజోమండలము లాగా వెలుగుతున్న, ఉదయించిన సూర్యుని వలె వున్నట్టి, నలుపు, తెలుపు, ఎరుపు  రంగులు కలిగి, ఆరు చేతులతో ఆవిర్భవించిన,బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశములు కలిగినట్టి, త్రిగుణాలుకు ఈశుడైనట్టి,ఋగ్, యజుర్వేద, సామవేద స్వరూపుడగు దత్త దేవుని చూసిరి🙏

3.ఆదిమధ్యాంతరహితం ! అనంతేతి చ విశ్రుతం!

బ్రహ్మోపేంద్రేశరూపం ! క్వచిదేకం పృథక్క్వ చ!

భావము:: ఆది, అంతము,నాశనము లేనివాడు, అనంతుడు,త్రిమూర్తి స్వరూపుడు, ఒక్కడే అనేక రూపములు ధరించినవాడు అయిన దత్తాత్రేయుని చూసిరి.🙏

4.రక్త చందన లిప్తాంగం! హంసవాహనమచ్యుతం

స్వరాలింగిత వామాంగం! ద్విభుజం ద్విజ దైవతం!

భావము::🙏 ఎర్రని మంచి గంధము పూయబడిన శరీరము కలిగి హంసవాహనమును ఎక్కిన బ్రహ్మ గానూ, శ్రీదేవి తో కూడిన విష్ణువు గాను, ఎడమభాగమున దేవితో కూడిన  శివుడు గాను, రెండు భుజములు కలవాడును, ద్విజులకు దేవతయైన దత్త స్వరూపమును చూసిరి.🙏


5.కమండలుం చ బిభ్రాణం! పూర్ణం దివ్యాంబునా సదా!

దివ్యపద్మాక్ష మాలాంచ! యజ్ఞసూత్రం తథైవ చ॥ 

భావము:: దివ్యమగు జలముతో నిండిన కమండలమును, దివ్య జపమాలను, యజ్ఞోపవీతమును ధరించినట్టి దత్త స్వామిని చూసిరి.🙏

6.చతుర్భుజం చతుర్వేదం ! చాతుర్హోత్రప్రవర్తకం !

ప్రజాపతిపతిందేవం ! జపంతంబ్రహ్మవాగ్యతం !

భావము:: నాలుగు భుజములు కలవాడును, నాలుగు వేదముల స్వరూపుడు, యజ్ఞప్రవర్తకుడు, బ్రహ్మకు ప్రభువైనట్టి వాడు, బ్రహ్మ జపమను చేయుచున్నట్టి ఆ దివ్యమైన దత్త స్వరూపమును మునులు చూసిరి.🙏

No comments:

Post a Comment