Thursday, 12 November 2020

గురుచరిత్ర... గుప్త భావం.... అధ్యాయం-13&14..🙏🏻

 దత్త లీలా క్షేత్ర మహత్యం...


గురుచరిత్ర...

 గుప్త భావం...

Rajyalakshmi.srinivas boddu palli.


అధ్యాయం-13&14..🙏🏻



మనం ఇప్పటి 12 అధ్యాయం వరకు గురు అనుగ్రహంతో కష్టాలు తీర్చుకుంటూ సాధన కొనసాగించాము. శరీరానికి వస్తున్న సుఖ,దుఃఖాలను సమoగా స్వీకరించడం ఎలాగో నేర్పుతుంది ఈ అధ్యాయం.


 ధర్మ ఆచరణ,ఏది ధర్మమో గురువు వద్ద శాస్త్ర ప్రామాణికంగా నేర్చుకోవాలి.


 నా దృష్టిలో ధర్మం అంటే మనం చేసేపని ఎదుటివారికి బాధ కలిగించకపోవడం. సర్వ ఆపదలనుంచి రక్షించి సాధనలో ముందుకు నడిపేది మన  గురువు. పూర్వ జన్మప్రారబ్ధం ఈ జన్మలో అనుభవిస్తాము. కొన్నిసార్లు గురు అనుగ్రహముతో మన సాధనకు ఆ ప్రారబ్ధం కానీ  అడ్డు అయితే గురు అనుగ్రహముతో ఎలా తప్పించుకోవచ్చో తెలుస్తుంది. గురువు ఏమి చెప్పినా మన మంచికే అన్న భావన బలపడుతుంది. అపథ్యంతో రోగాలు తగ్గించడం ఇలాంటి దే., ఆత్మ సమర్పణ చేసుకో,నీ కోరికలు నెరవేరుతాయి.. ఇలాంటి గురు భోధలు,ఆభయాలు మనలాంటి సాధకులకు  ధైర్యాన్ని ఇస్తాయి. ఇలా సాధనలో ముందుకు వెళ్ళడానికి గురువు నుంచి వచ్చిన  ధైర్యం తో పాటు మనకి గురువు మీద ప్రేమ పెరగడానికి  మనకు సహకరిస్తాయి.

No comments:

Post a Comment