దత్త లీలా క్షేత్ర మహత్యం..
శ్రీ గురు చరిత్ర..
గుప్త బోధ...
రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
అధ్యాయం-12..
సాధకులకు లోకిక బంధాలు, మమకారాలు ఎన్ని జన్మలకు దారి తీస్తాయో తెలియజెప్పె అధ్యాయం. పుత్రుడు మొదలగు లౌకకిక బంధాలు, మమకారాలు మనలో కట్టి వేసుకోవడం వల్ల, లోక కల్యాణ కార్యక్రమాలు చేయనియకుండా అవి అడ్డుపడుతాయి.
ఇవి అన్నీ అశాశ్వతమైనవి అని గురువు మనలను హెచ్చరిస్తారు. కొన్ని వ్రతాలు,పూజలు లాంటివి చేస్తూనే ఈ బంధాల పట్ల ఎంత వైరాగ్యముగా ఉండాలో, మన సాధన లోకిక ఆసక్తి తగ్గి క్రమేపీ భగవత్ ధ్యానం, తపస్సుగా ఎలా మారాలో తెలియజేస్తుంది.
గురు బోధ, గురు సేవ ద్వారా తెలుసుకోమని,ఆ భోధలు ఆచరించినప్పుడే మాత్రమే గురు అనుగ్రహం కలుగుతుంది అని తెలుసుకోవడం ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
జై గురు దత్త
No comments:
Post a Comment