దత్త లీలా క్షేత్ర మహత్యం...
గురు చరిత్ర
గుప్త భావం..
అధ్యాయం-6...🙏🏻
రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
మన సాధన ఇప్పుడిప్పుడే లౌకిక భంధాల విషయంలో ఎలా వుండాలో ఐదవ అధ్యాయం స్పష్టంగా తెలిపింది. తరువాత కొద్ది కొద్దిగా జ్ఞానం అనే ప్రకాశంతో, గురు నామస్మరణతో మనస్సు పవిత్రం అవ్వడం,తద్వారా గురువుపై మన విశ్వాసం ధ్రువపడడం ఈ అధ్యాయం ద్వారా జరుగుతుంది. సద్గురువు లను జంగమ క్షేత్రాలు(అంటే నడిచే పుణ్య క్షేత్రాలు,అన్ని పుణ్యక్షేత్రాలు వారి పాదాలలో ఉంటాయి కాబట్టి, వారితో ఎప్పుడూ ఉండటం కుదరకపోతే, ఏ ఏ పుణ్యక్షేత్రాలలో సాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ అధ్యాయం తెలుపుతుంది.
క్షేత్ర మహిమలు, త్వరగా మన సంకల్పం సిద్దించడానికి దోహదపడే విషయాలు తెలుస్తాయి. అందుకే మధ్య మధ్యలో పుణ్యక్షేత్రాలలో పుణ్య కార్యములు, సాధనస్వయంగా వెళ్లి చేస్తూ ఉండాలి.దానివల్ల మనము ఈ.లోకిక విషయాల్లో మనస్సు పెట్టడం తగ్గించవచ్చు. అలా మనస్సు క్రమేపీ లోకిక విషయాలను ,ఆ ఆలోచనలు తగ్గించుకునే సాధన అలవరచు కుంటుంది.
జై గురు దత్త
No comments:
Post a Comment