దత్త లీలా క్షేత్ర మహత్యం...
గురుచరిత్ర.
.గుప్త బోధ..

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
అధ్యాయం- 29-33
మనం సాధన జరిగేటప్పుడు అవసరం అయితే, మనకు శ్రేయస్సు అయితే గురువు మనల్ని మృత్యు ముఖం నుంచి కూడా రక్షిస్తారు. మనలో ఇప్పటి వరకు జరిగిన సాధనలో మనలో సద్గురువుకు ఇష్టం అయిన ధర్మాచరణ పెరుగుతుంది. భగవంతుడు సర్వం వ్యాపించివున్నాడు,మనల్ని గమనిస్తున్నారు అన్న భావన పెరిగేకొద్దీ మనలో ధర్మం,సత్యం పట్ల ప్రీతి పెరిగి,సర్వం ప్రేమ మయంగా కనపడుతూ సాధనలో మరింత ముందుకు వెళతాము. విషయ వాసనలు క్రమేపి. నశించడం మొదలు అవుతుంది. అవే మరు జన్మలకు కారణం కాబట్టి.
ఇప్పుడు అవసరం అయితే సద్గురువు తన పుణ్యం అడ్డువేసి మన పాప కర్మలను తొలగిస్తారు. మనకు కృతజ్ఞతా భావం పెరిగి ఇంకా శ్రద్ధగా సాధన చేసే అవకాశం పెరుగుతుంది.మనం.చేసే కర్మలు,భక్తి ఒక యోగాలు గా మారి దత్త తత్వo అర్ధం అయ్యి మనకు దత్త దర్శనం కి కూడా ప్రసాదించ గల అధ్భూత గ్రంధం ఈ గురు చరిత్ర.
No comments:
Post a Comment