Thursday 19 November 2020

గురుచరిత్ర...గుప్త భావం..🙏🏻 అధ్యాయం- 48-51

 దత్త లీలా క్షేత్ర మహత్యం...

గురుచరిత్ర...గుప్త భావం..🙏🏻
అధ్యాయం- 48-51
మిగిలిన చిన్న చిన్న ప్రారబ్ధాలను గురు అనుగ్రహంతో తప్పించుకొని జీవన్ముక్తి వైపు పయనించి మోక్ష స్థితికి చేరువ అవుతున్నాము. సమస్తం ఇక గురు స్వరూపంగా దర్శనం కలుగుతోంది కనుక, తనకు అన్యము అయినది ఇప్పుడు ఏది లేదు.
గురువే సర్వస్వం.ఇప్పుడు మనం త్రిగుణ తీతం అయి, ఆ+త్రి అత్రి తత్వం ని మనలో నిలుపుకున్నాము.అనసూయ తత్వం,అత్రి తత్వం మనలో ఎప్పుడైతే ప్రవేశించి నదో దత్తాత్రేయ తత్వం తనకు తానుగా వచ్చి మనకు దత్తం అవుతారు.అదే దత్తత్రేయ జన్మ రహస్యం.
పారాయణ ద్వారా సాధనా పరంగా ఈ భావన దృఢపడింది. ఆ భావనే ఆనందం కలిగిస్తోంది. ఏ భావన మనకు ఆనంద స్థితి కలిగిస్తోందో ఆ ఆనంద స్థితియే మన లక్ష్యం కనుక, ఆ ఆనందస్థితి యే దుఃఖ స్పర్శ లేని ఆనందంగా పరిణమించింది. అంటే మనకు సంపూర్ణ సద్గురు అనుగ్రహం లభించింది,తన్మయత్వం కలుగుతోంది. ఇక గురువు,తాను ఒక్కటే అన్న భావనలో నిలిచిపోయి మన సాధనలో చివరి మెట్టు అయిన పరమాత్మలో లీనమై,పోయి,మనస్సు నిశ్చల స్థితిలో ఉండి, తనకు అన్యమైనది ఏది లేదు కనుక శాశ్వత ఆనంద స్థితిలో ఉండి పోయాము.
ఇదే గురుచరిత్ర పారాయణ సారాంశం.ఇలా గురుచరిత్ర పారాయణ చేస్తే మన జన్మ ధన్యం అయినట్లే.ఆ పరమాత్మ లో లీనం అయినంత మాత్రాన మనకు మోక్షం రాదు.అని ఈ రాబోయే అధ్యాయం హేచరిస్తోo ది.మరి ఏమి చేస్తే మనకు మోక్షం లభిస్తుంది?.
జై గురు దత్త

No comments:

Post a Comment