Thursday, 5 November 2020

గురుచరిత్ర గుప్త భావం... అధ్యాయం-5..🙏🏻

 దత్తలీలా క్షేత్ర మహత్యం....

గురుచరిత్ర 

గుప్త భావం...

అధ్యాయం-5..🙏🏻

ఏమి చెపుతోంది.

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

ఏమి తెలియని స్థితిలో మనము సత్యాన్వేషణ కు బయలు దేరగా ఆవు దూడను విడిచి ఉండలేనట్లు పరుగున సద్గురువు రూపంలో ఆ భగవంతుడు పరుగున తన బిడ్డ దగ్గరకు వచ్చారు.వచ్చి తన బిడ్డకు ఉపదేశిస్తూనే సంస్కరించు చున్నారు.

మనలో తెలియకుండా నే గురు సమక్షంలో అంతర్గత ప్రక్షాళన మొదలు అయింది.అదే గురు సమక్ష మహిమ.ఇప్పుడు 

మాములు మానవ శరీరంతో వచ్చిన గురువును గుర్తించి సేవించడం ఎలా?ధర్మ రూపుడై ,సత్య స్వరూపుడు అయిన గురువు మానవులకు ఎలా వరాలు ఇస్తారు? పవిత్రమైన గర్భంలో ఎలా జన్మించారు? లోక కళ్యాణానికి కారణమైన కోరికలకు భగవత్ కృప, ఆశీస్సులు ఎలా లభిస్తాయి? లౌకిక భంధాలలో చిక్కుకున్న వారికి తన భోధతో శాశ్వతమైనస్థితి ఏమిటో తెలియజెప్పడం,భక్తుల మాయా, మొహాలు పటాపంచలు చేయడం ఇలాంటి విషయాలు తెలుపుతుంది.

No comments:

Post a Comment