Monday, 16 November 2020

మహాత్ముల పరిచయం-381 శ్రీ దేవకీ నందన స్వామి...🙏🏻

 మహాత్ముల పరిచయం-381

శ్రీ దేవకీ నందన స్వామి...🙏🏻


రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి


సదాశివ కాళే, పార్వతి బాయి దంపతులకు దత్తాత్రేయ ఉపాసన వల్ల 23-7-1888 సంవత్సరం లో కొల్హాపూర్ లో జన్మించారు. వీరి అసలు పేరు ఆత్మారామ్. చిన్నప్పుడు చాలా మెతకగా ఉండేవారు. తల్లి దిగులుపడి దత్తాత్రేయ స్వామిని ప్రార్ధించారు. దత్తుడే దర్శనం ఇచ్చి ఇతను నా అంశ, దిగులు పడకు అన్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పరమపదించారు. వారికి కలలో ఎప్పుడూ అనేకమంది దండ  సన్యాసులు కనపడేవారు. వీరికి అలా సన్యాసం తీసుకోవాలని కోరిక వుంది. అన్న గారి అనుమతితో వీరు దగ్గరలో ఉన్న నృసింహవాడి కి వెళ్లి, ఉపవాస దీక్షతో దత్త కృపకు ఎదురు చూశారు. ఒకరోజు ఒక యతి కనపడి ఇంకా పరిపక్వత చెందు అని అనగా, పట్టుదలతో అక్కడే దత్తాత్రేయ కృప కోసం ప్రార్ధించారు. యతి అయిన మాధవాశ్రమ స్వామికి కూడా దత్తాత్రేయ స్వామి కనపడి  వాడు నా అంశ, సన్యాసం ఇవ్వు అని అజ్ఞాపించారు. వారు స్వామికి 15 వ ఏటా సన్యాస దీక్ష ఇచ్చి తనతో పాటు తీసుకెళ్లి ప్రణవోపాసన, అత్మైక్యసంధానం లాంటి సాధన చేయించి, చాతుర్మాస్య దీక్ష చేయించారు. తరువాత గురు ఆజ్ఞపై హిమాలయాలలో తిరిగి జలపానం తో అబూ పర్వతం పై తపస్సు చేశారు. నర్మదా తీరంలోని బరూచి వెళ్లి జ్ఞానదండం ఉండగా బాహ్యదండం వద్దని నర్మదా మాతకు ఇచ్చి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలం, బిళ్ళ కుఱి గ్రామం చేరారు. అక్కడి వారు స్వామిని చూసి చాతుర్మాస్య దీక్ష వారి గ్రామంలో చేయమని ప్రార్ధించారు. వీరు ఒప్పుకొని అక్కడే తన స్థిర నివాసం చేసుకున్నారు.

1902 నుంచి 1948 వరకు మొత్తం 47 చాతుర్మాస్య దీక్షలు చేశారు.

1.గింజ పట్టిన కంకే వంగిఉంటుంది. జ్ణానం కలిగిన మనిషి నమ్రత తో వుంటారు.

2. భక్తి అనే నది యొక్క లోతు అంతు పట్టదు. అయినా నది అనే భక్తి లో దూకిన వ్యక్తి ప్రాణం పొగగొట్టుకోడు.

3.ఆశించడం వల్ల కాకుండా,అర్హత కలిగి ఉండడం వల్ల ఎదైనా పొందుతావు.

4. ప్రేమను పొంది,ద్వేషం పంచే జీవులు పాలు త్రాగి విషం కక్కుతారు.

మధురలో వీరు గుడి లోపలకి వెళ్ళాక బయట ఆనందస్థితి లో ఉండిపోయారు. మిగతా భక్తులు లోపలకి వెళ్లి చూడగా అమ్మతో వీరు చదరంగం ఆడుతూ కనపడ్డారు.సబిళ్ళ కుఱ్ఱలో ఒక గ్రంధాలయం స్థాపించి 10,000 పుస్తకాలు ఉంచారు. దేవకినందనాశ్రమం స్థాపించి 1934 సంవత్సరం లో వేదోద్దరణ చేశారు. బహుళ ఏకాదశి రోజు (23-4-1973) సంవత్సరంలో సమాధి చెందారు. దత్తాత్రేయ సంప్రదాయం ప్రకారం వారిని జల సమాధి చేశారు.15 రోజుల తరువాత వారి దేహం మళ్ళీ కనపడి, సుగంధాలు వెదజల్లాయి. తరువాత వీరు సమాధి చెందిన ప్రాంతంలో శివలింగం ప్రతిష్ఠ చేశారు.

అడ్రస్:శ్రీ దేవకినందన స్వామి ఆశ్రమం,

బిళ్ళ కుఱ్ఱ గ్రామం,

కొత్తపేట తాలూకా,,

తూర్పుగోదావరి జిల్లా.

AP.

No comments:

Post a Comment