Thursday, 5 November 2020

శ్రీ గురు చరిత్ర....🙏🏻 అధ్యాయం 3&4... గుప్త భావం

 దత్త లీలా క్షేత్ర మహత్యం

శ్రీ గురు చరిత్ర....🙏🏻

అధ్యాయం 3&4...

గుప్త భావం

3&4అధ్యాయాలు మనకు ఏమి చెపుతున్నాయి?

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

మనలో భగవంతుని చేరాలి (మన నిజ స్వరూపం తెలుసుకోవాలి )అనే  జిజ్ఞాస  ఇప్పుడే పెరిగింది అంటే గురువు యొక్క  అనుగ్రహం ప్రారంభం అయినట్లు. మీరు మీ గురువుని ఎలా సేవించి అనుగ్రహం పొందారు? అని మన గురువును అడిగి తెలుసుకోవచ్చు.


నేను నాకు దొరికిన  సద్గురువును ఎలా శ్రద్ధగా, భక్తితో సేవించాలి? గురు లీలలు గమనించడం, గురువు గురించి, వారి భోధనలు శ్రద్ధగా వినడం కూడా అమృత సేవనంతో సమానమే.  మన  గురువు మనలను కూడా కొన్ని మిషలతో అంటే లోకిక కోరికలు తీరుస్తూ ఆధ్యాత్మిక వైపుకు నెడుతూ గురు భోధల  ఆచరణ వైపుకు కూడా నెడతారు.


 అసలు విశ్వ గురువు అయిన దత్తుడు ఎందుకు, ఎలా వెలిశారు అని తెలియజేస్తుంది ఈ అధ్యాయం. మరల, మరల ఎందుకు జన్మిస్తున్నారు?అత్రి,అనసూయలు ఎలా దత్తుడిని దత్తం చేసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

వారు దుర్వాస మహర్షి శాపం వలన భూమి మీద మరల మరల జన్మించడం  మనకు వరం. వారి ప్రతిజ్ఞ మనకు సంతోషం. వారి ప్రతిజ్ఞ ఏమిటి?

ప్రపంచంలోని చివరి జీవిని కూడా  తరిపజేసి, మోక్షం ఇవ్వడం తన ప్రతిజ్ఞ.

జై గురు దత్త🙏🏻

No comments:

Post a Comment