Thursday 5 November 2020

శ్రీ గురు చరిత్ర....🙏🏻 అధ్యాయం -2...🙏🏻 🌷గుప్త భావం 🌷

 దత్త లీలా క్షేత్ర మహత్యం


శ్రీ గురు చరిత్ర....🙏🏻


అధ్యాయం -2...🙏🏻

 🌷గుప్త భావం 🌷

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

ముందు భగవంతుడు ఉన్నాడా?లేడా? అన్న స్థితి నుంచి తన కల (అనుభవం) ఆధారంగా వున్నాడు అని నిర్ణయించుకొని ఆ గురు దేవుని దర్శనం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఆ స్వప్న మూర్తిని ధ్యానిస్తూ, వెతుకుతూ సాధనగా మనసును ఈ దివ్య మూర్తి మీద లగ్నం చేసాడు . తనకు స్వప్న దర్శనం వలన  గురు అనుగ్రహము లభిస్తుంది అన్న నమ్మకం కలుగుతుంది. తన సందేహలు,తనలో  దోషాలు నాశనం  అవ్వడం మొదలవుతుంది.. ఇక గురు ప్రాముఖ్యత, గురువు యొక్క  బోధ,గురుబోధ ఆచరణ,ఇవి గురు అనుగ్రహముతో పాటు,ఆచరణలోకి తెచ్చుకొని,ఆత్మనుభూతి పొందడమే మిగిలినది. ఎలా పొందాలి, తెలియదు. అందుకే చేస్తున్న సాధనతోనే  ముందుకు పోవాలి.మన సంగతి మనకు తెలియదు.అది తెలియజేసేవాడే గురువు.


 నామాధారకుడు వెతుకుతూ ముందుకు పోతున్నాడు. గురువు ఎదురుగా ప్రత్యక్ష దర్శనం లభించింది. గురువుని కళ్లారా చూసుకొని,సాష్టాంగ ప్రమాణం చేసుకొని ఆర్తితో ఇంత ఆలస్యం అయిందే దర్శనం అనుగ్రహించటానికి అని మనలా అమాయకంగా  అడిగారు. 


స్వామి నామధారకునితో భగవంతుని కృపాదృష్టి లో లోపం లేదు, నీ ప్రార్ధనలోనే సంశయం ఉంది. భగవంతుడు వున్నాడు, అతని మీద గోత్ర ఋషులకు ఫిర్యాదు చేస్తాను అన డంతో సంశయం పోయి వున్నాడు  కాబట్టి  అన్నావు కాబట్టిదర్శనం లభించింది. సంశయాత్మకుడు,శ్రద్ద లేని వారు భగవంతుడు చేత అంగీకరింపబడరు. అని శిష్యునిలోని  లోపo సరి దిద్దారు.

శిష్యుడికి  బుద్ధి చాపల్యం,చపల చిత్తం పోవడంతో,శ్రద్ద వచ్చింది. అప్పుడు గురువు చేత బుద్దిమంతుడవు అని అనిపించుకున్నాడు. అంటే సాధన ద్వారా  గురువుని సంతోష పెట్టడం(సేవించడం) మొదలు అయింది. అంటే సేవ ద్వారా నే కదా మనలో అహంకారం, విషయ వాసనలు పోయేది.కలి ప్రభావం, మాయ మొహం వల్ల చెంచలమైన మనస్సు గురువు దొరికిన తరువాత గురువుని అనన్యంగా ఎలా సేవించాలి?ఎలా సంతోష పెట్టాలి?సాత్విక మైన ఓర్పుతో ఎలా సేవించాలి అని తెలిపే అధ్యాయం ఇది.

గురు ప్రాముఖ్యత తెలుసుకుంటే కదా,గురువుని శ్రద్ధగా సేవించేది.

ఇలాంటి అనుభవం గురువే ఇవ్వాలి కదా.

జై గురు దత్త

No comments:

Post a Comment