Monday, 16 November 2020

గాణగాపురం లోని అష్ట తీర్ధాలు..🙏🏻

 దత్త లీలా క్షేత్ర మహత్యం

నరక చతుర్దశి

ఈ రోజు శ్రీ గురుడు 7 రూపాలలో వివిధ ఇంటిలో భిక్ష స్వీకరించి ఇంకో రూపంలో గణుగా పూర్ లో మఠం లో ఉండిపోయారు.

ఈ రోజు అందుకే అష్ట తీర్ధాలలో స్నానం చేస్తే పుణ్యం అని శ్రీ గురుడు తెలిపారు.

అష్ట తీర్ధాలు


దత్త. లీలా క్షేత్ర మహత్యం

రేపు నరక చతుర్దశి రోజు గణుగా పూర్ లో అష్ట తీర్ధాలలో స్నానం చేస్తే మంచిది.

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి


గాణగాపురం లోని అష్ట తీర్ధాలు..🙏🏻

1&2- షట్ కుల& నరసింహ తీర్థం:ఈ తీర్ధాలలో ఎవరైనా శ్రద్ద, భక్తితో స్నానం చేస్తే అకాల మృత్యువు, మరియు కాల మృత్యువు జరుగదు. శతాయుష్య వంతులు అవుతారు. ప్రయాగ లోల త్రివేణి సంగమం లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.

ప్రాంతం: సంగమంలో రెండు  నదులు కలిసే ప్రాంతంలో షట్ కుల తీర్థం ఉంది.ఈ తీర్థమునకు దగ్గరలో రెండవ తీర్థం అయిన నరసింహతీర్థం ఉంది.

3. భాగీరథీ తీర్థం::- ఈ తీర్థంలో స్నానం చేస్తే సమస్త దరిద్రాలు నాశనం అయి కాశీ క్షేత్రంలో గంగా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.

ప్రాంతం: ఈ కుండము భీమానది కలిసే చోట ఉంది.

4. పాపవినాశిని::- ఈ తీర్ధంలో స్నాన మాత్రం చేతనే పాపరాశి దగ్ధం అవుతుంది. ఇక్కడ స్నానం చేయటంవలన సమస్త  పూర్వ జన్మల పాపం నశిస్తుంది. శ్రీ గురుని యొక్క  

పూర్వాశ్రమ సోదరి అయిన రత్న తెల్ల కుష్టు రోగం పోయింది.

ప్రాంతం: భాగీరథీ తీర్థమునకు 500 మీటరుల దూరంలో ఉంది.

5.కోటి తీర్థం::- ఈ తీర్ధంలో స్నానం చేస్తే ఆత్మశుద్ది కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది. మరియు జంబుద్విపంలో కల అన్ని తీర్ధాలలో స్నానం చేసిన అనంతమైన  పుణ్యం లభించి, శక్తి కొలది దానం చేస్తే కోటి దానాల ఫలితం లభిస్తుంది.

ప్రాంతం: దండవతే మహరాజ్ మఠం కు ఎదురుగా ఉంది.

6.రుద్ర తీర్థం::- ఈ తీర్థం "గయ"తో సమానం. గయలో చేసే సర్వ ఆచరణలు అయిన పూజలు, కర్మలు, ఇక్కడ చేస్తే కోటి జన్మల పాపం ,దోషం నశిస్తుంది.

ప్రాంతం: కోటి తీర్ధంకు కొద్దీ దూరంలో ఉంది.

7.చక్ర తీర్థం::- ఈ తీర్థం ద్వారావతి(ద్వారక)తో సమానం. ఇక్కడ స్నానం చేసి కేశవ మందిరంలో పూజ చేస్తే ద్వారకలో చేసిన పుణ్య స్నానాలు, పూజల కన్నా నాలుగు  రెట్లు పుణ్యం లభించి,అజ్ఞానికి జ్ఞానం లభిస్తుంది.

ప్రాంతం: కేశవ,చక్రేశ్వర్ మందిరం పక్కన ఉంది.

8.మన్మధ తీర్థం::- ఇక్కడ స్నానం చేసి,ఇక్కడే ఉన్న కాళేశ్వరునికి పూజ చేస్తే వంశ అభివృద్ధి అయి, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

ప్రాంతం:: కాళేశ్వర్ మందిరం పక్కన ఉంది.

ఈ అష్ట తీర్ధాలలో నరక చతుర్దశి రోజు స్నానం చేయడం అతి పవిత్రం.

ఈ తీర్ధాలు దర్శించడానికి కాలి నడకన ఆరు గంటలు పడుతుంది. ఆటోలో మూడు  గంటలు పడుతుంది.

జై గురు దేవ దత్త.🙏🏻

No comments:

Post a Comment