Thursday 5 November 2020

నృసింహ వాడి లో స్వామి వారి నిత్య కార్యక్రమం... Part-49🙏🏻

 దత్త. లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:రంగావధూత


తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి

నృసింహ వాడి లో స్వామి వారి నిత్య కార్యక్రమం...

Part-49🙏🏻

నృసింహవాడి నుంచి స్వామి బయలు దేరేటప్పడికి సాయంత్రం అయింది. ఈ రోజు స్వామి కురుద్వాడలోని కృష్ణా ఘాట్ లో మజిలీ చేశారు. అక్కడ దత్త దర్శనం చేసుకొని అక్కడే ఆశీనులు అయ్యారు. వారితో పాటు అక్కడికి  సుమారుగా 200 మందిదాకా  వాడి నుంచి వచ్చిన భక్తులు వచ్చారు. స్వామి కురుద్ వాడి వచ్చారని తెలుసుకొని అక్కడ ప్రజలు స్వామి దర్శనం కోసం వచ్చారు. స్వామి సంగమంలో కూర్చోడానికి వెళ్లగా అక్కడ భక్తుల వినతి ప్రకారం స్వామి అక్కడ కృష్ణ నీళ్లను వారిపై సంప్రోక్షణ చేశారు. సాయంకాలం సంధ్యావందనం తరువాత స్వామి ఘాట్ మీద దత్త మందిరానికి వచ్చారు. అక్కడ నృసింహ వాడి వచ్చిన భక్తులు భజనలు చేసి,వాడీకి వెళ్లిపోయారు. ఈ రాజ్యం యొక్క రాజు స్వామి దర్శనం కోసం తరుచూ వాడి వెళ్లి దర్శించుకొని 10 నిమిషాలు ఉండి వచ్చేవారు. ఈసారి స్వామి వారు కురుద్వాడి వచ్చేసరికి రాజు బాలాసాహెబ్ ఒక పని మీద మిరాజ్ వెళ్లారు. స్వామి ఇక్కడకు వచ్చారని తెలిసి  రాత్రికి వెనుకకు వచ్చి స్వామితో మీరు వస్తున్నారని తెలియదు, ఈ అపరాధమునకు క్షమించండి అని వేడుకున్నారు. స్వామి తన రాష్ట్రాన్ని పావనం చేసినందుకు చాలా సంతోష పడ్డారు. మరురోజు భిక్ష స్వీకరించవలసినది గా వేడుకున్నారు. స్వామి అంగీకరించడంతో వెంటనే వంట సామాను సేకరించి అక్కడే ప్రారంభించారు. బాలా సాహెబ్,దాజి సాహెబ్,భావు సాహెబ్అనే ముగ్గురు స్వామికి సంప్రదాయం ప్రకారం భిక్ష ఇచ్చారు.(సన్యాసులకు 3 ఇళ్లలో భిక్ష స్వీకారం చేయాలి,అందుకని ఇలా చేశారు.) ఆ రోజు 1,500 మంది నైవేద్యం స్వీకరించారు. స్వామి మహరాజ్ పక్కన నృసింహ సరస్వతి స్వామి(దీక్షిత్ స్వామి)ఇంకా 4 వేరే సన్యాసులు భిక్షకు కూర్చున్నారు.

భిక్ష తరువాత స్వామి మహరాజ్ బయలుదేరుతున్నారు. రాజు 

గౌరవప్రదంగా స్వామిని తీసుకెళతానని రాజు తెలిపారు. స్వామి అంగీకరించలేదు. స్వామి స్థానిక విష్ణు ఆలయం,దత్త ఆలయానికి వెళ్లి రాజు వినతి ప్రకారం రాజుకోటకు వెళ్లి,ఆశీర్వదించారు. స్వామి వారితో నేను ఎన్నో రాజ్యాలు వెళ్ళాను. కానీ ఎక్కడ రాజమహల్ లో కాని, రాజు భిక్ష స్వీకరించ కూడదని నా నియమం. మొదటిసారి మీ భక్తి చూసి నియమం తప్పాను అని అన్నారు.

స్వామి అలా చెప్పడంతో బాలాసాహెబ్ స్వామికి నమస్కారం చేసుకున్నారు. స్వామి తర్వాత దేవిని దర్శించుకొని గ్రామం వదిలారు. స్వామితో రాజు, అతని సైనికులు వెనుక నడిచారు. స్వామి వారిని తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించారు. వారు మా మీద ఇలాగే అఖండ కృపా దృష్టి ఉంచండి అని గొంతు బొంగురపోగా ,కళ్ళ వేంట నీరు కారింది. స్వామి మహరాజ్ వారితో గోవులను, బ్రాహ్మాణులను రక్షించడం రాజు ధర్మం ఇది ఆచరించి శ్రీ గణపతిని సేవించండి మీకు కళ్యాణం అవుతుంది అని ఆశీర్వదించి. స్వామి ముందుకు వెళ్లిపోయారు.

జై గురు దత్త

No comments:

Post a Comment