Monday 16 November 2020

అల్లరిదత్త

 దత్త లీలా క్షేత్ర మహత్యం

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

🙏🏻ఓం శ్రీ గురుదేవ దత్త 🙏🏻

అల్లరిదత్త 

శ్రీ ప.ప వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు తమ పన్నెండవ చాతుర్మాస్య దీక్ష బ్రహ్మావర్తము నందు చేశారు. అక్కడ వున్నప్పుడు దీపావళి పండుగ వచ్చెను. స్వామి వారి వద్ద నున్న చిన్న దత్తమూర్తికి అందరూ పూజ చేశారు. పూజా పుష్పములన్నీ ఒక పెద్ద రాశిగా పడ్డాయి. గురు చరిత్ర పారాయణలు, భజనలు, కీర్తనలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గ్వాలియర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు ఏకాంతము చూసుకొని, " మహరాజ్! మీరు సన్యాసాశ్రము లో వుండి కూడా మూర్తి పూజ చేయుచున్నారు ఏమిటి ",అని అడిగాడు. అప్పుడు స్వామి వారు శాంతముగా, " నిర్గుణోపాసన చేశేవారు  సగుణోపాసన చేయవలనని నియమం ఏమి లేదు. కాని ఈ మూర్తి నన్ను వదిలిపెట్టడం లేదు. ఏమి చేయను?" అన్నారు.  మీరే వదిలి పెట్టండి అని ఆ భక్తుడు అనగా,స్వామి వారు సరే అని ఆ భక్తుడిని తీసుకుని గంగా తీరమునకు వెళ్లారు. తమ దగ్గర వున్న దత్తమూర్తిని స్నానానంతరము గంగా ప్రవాహంలో ముంచి, ఒడ్డుకు వచ్చారు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. గంగ లో ముంచిన అంగుష్ట ప్రమాణం కలిగిన  ఆ దత్త విగ్రహం స్వామి వారి ముందుకు వచ్చింది. అది చూడగానే ఆ భక్తుని అహంకారం నిర్మూలనమై, స్వామి వారితో పాటు నిత్యము దత్త స్వామి వెంబడి వుండి వారితో మాట్లాడును అని విషయము ప్రత్యక్షంగా నిదర్శనమయ్యెను. అప్పటి నుంచి ఆ భక్తుడు స్వామి వారిని అత్యంత భక్తి, శ్రద్ధలతో సేవించాడు. 🙏🏻

No comments:

Post a Comment