Tuesday 3 November 2020

శ్రీ దత్తస్తవము.

ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని
దత్త హృదయం నందు చెప్పబడియుంది ...
దత్త దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయం !!
శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణకు మాత్రం సంతుష్టుడు తీవ్రమైన పూజాదికాలు చేయకపోయిన
" అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ "
అనే పవిత్ర భావనతో , భక్తితో దత్త దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి , రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీ దత్తాత్రేయుడు ..
శ్రీ భాగవత గ్రంథము నందు ప్రథమ స్కంధ తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో 6 వ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడినది...
స్వామి స్మరణ రోగాలను పటాపంచలు చేస్తుంది .... భూత , ప్రేత , పిశాచ , గ్రహ బాధలను దూరం చేస్తుంది .... పీడకలలు దరిరావు ....
సర్ప , వృశ్చికాది జనిత విషబాధలు , కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి ....
త్రికరణ శుద్ధి కలుగుతుంది ....
కోరిన కోర్కెలు నేరవేరి జీవితం ధన్యమవుతుంది ...
🌼🌼🌼🌼శ్రీ దత్తస్తవము.🌼🌼🌼🌼
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ఓం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్త వత్సలం !
ప్రప్రన్నార్తి హరం వందే స్మర్త్యగామీ సనోవతు !!
దీనబంధు కృపాసింధుం సర్వకారణ కారణం !
సర్వరక్షాకరం వందే స్మర్త్యగామీ సనోవతు !!
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం !
నారాయణ విభుం వందే స్మర్త్యగామీ సనోవతు !!
సర్వానర్థ హరం దేవం సర్వ మంగళ మంగళం !
సర్వ క్లేశ హరం వందే స్మర్త్యగామీ సనోవతు !!
బ్రహ్మణ్యం ధర్మ తత్త్వజ్ఞం భక్తి కీర్తి వివర్థనం !
భక్తభీష్ట ప్రదం వందే స్మర్త్యగామీ సనోవతు !!
శోషణం పాప పంకస్య దీపను జ్ఞాన తేజసః !
తాప ప్రశమనం వందే స్మర్త్యగామీ సనోవతు !!
సర్వరోగ ప్రశమనం సర్వ పీఢా నివారణం !
ఆపరుద్ధరణం వందే స్మర్త్యగామీ సనోవతు !!
జన్మ సంసార బంధఘ్నం సర్వరూపానంద దాయకం !
నిశ్శ్రయస పదం వందే స్మర్త్యగామీ సనోవతు !!
జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యత్ స్తవం !
భోగ మోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ యసుకృతీ భవేత్ !!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment