Thursday 19 November 2020

గురుచరిత్ర... గుప్త బోధ... అధ్యాయం-15-19

 దత్త లీలా క్షేత్ర మహత్యం

గురుచరిత్ర...
గుప్త బోధ..🙏🏻
రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
అధ్యాయం-15-19
మనలో లోకిక మైన కోరికలు సాధనకు అంతరాయం కలిగిస్తాయి. అదే 15 వ అధ్యాయం హెచ్చరిస్తుంది. వాటిని నియంత్రిoచుకోవటం ఎలా సాధ్యం?
అయినంతవరకు మొదటి లో అందరికి దూరంగా ఉంటూ సాధన చేయడం మంచిది. ఆ సాధన పుణ్యక్షేత్రాలలో చేస్తే ఇంకా భక్తి కుదురుతుంది. ఫలితంకూడా ఎక్కువగా లభిస్తుంది.
మనలో ఇలా సాధన తీవ్రం అయ్యేకొద్ది మనము ఒకప్పుడు పడ్డ కష్టాలు ఒకప్పటి మన కర్మ ఫలితమే అన్న భావన అనుభవం లోకి తెలుస్తుంది. అన్నింటి మీద కొద్దీ,కొద్దిగా సరి అయిన అవగాహన పెరుగుతుంది. దానితో ప్రతి కష్టాలు,బాధలు భగవత్ ప్రసాదంగా తీసుకోవడం మొదలు పెడతాము. అంటే సాధనలో మనం చాలా దూరం వచ్చినట్లే.
ఈ భావన మనలో ఎప్పుడైతే కలుగుతుందో గురువు మీద ఇంకా భక్తి,శ్రద్ద ,గౌరవం,విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం తక్కువగా ఉన్న వారికి గురువు మనకు శ్రేయస్సు కానిది ఏది చేయరు అని ఆ అధ్యాయాలు పారాయణ ద్వారా నేర్పుతుంది. గురువు మీద విశ్వాసం పెరిగేకొద్దీ గురువు చిన్న చిన్న ప్రాయశ్చిత్త కర్మలు ద్వారా అంటే (ఉపవాసాలు,ప్రదక్షిణలు లాంటి వి,దానాలు,సేవ )లాంటి వాటి ద్వారా మన ప్రారబ్ధం తీసివేయడం జరుగుతుంది. అందుకే కొద్దిగా శరీరం ని కష్టపెట్టె సాధనలు చేస్తూ సాధనలు చేస్తూ ఉండాలి.
కె
జై గురు దత్త.

No comments:

Post a Comment