Wednesday, 11 November 2020

శ్రీ సిద్ధ మంగళ స్త్రోత్రం:

 శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి గురు ద్వాదశి రోజు నవంబర్ 12 వ తేదీ(గురువారం) రోజు కురువపురం లో అంతర్ధానం అయ్యారు.

దత్త లీలా క్షేత్ర మహత్యం
ఈ రోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అంతర్ధానం అయిన రోజు.
స్వామి వారి సిద్ధ మంగళ స్త్రోత్రం
తెలుగు :రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
శ్రీ సిద్ధ మంగళ స్త్రోత్రం
*1.శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా|
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండశ్రీ విజయీభవ||
భా||. ఓ అప్పల లక్ష్మీనరసింహరాజా, శ్రీ మద అనంతమైన విశేషంగా శ్రీ చే శోభిల్లుచున్నవాడా!, ఆనంద స్వరూపుడైన శ్రీ పాదునికి జయ విజయీభవ దిగ్విజయీభవ! శ్రీ,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ శ్రీవిజయీభవ||
2.శ్రీ విధ్యాధరి రాధా సురేఖా శ్రీ రాఖీధర శ్రీపాదా|
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండ శ్రీవిజయీభవ||
భా ||. శ్రీ విధ్యాధరి ,రాధ, సురేఖ అనే సోదరిలతో రక్షా బంధనం ధరింపచేసుకుని, శాశ్వత విజయం,అఖండ విజయలక్ష్మి ని కలిగిన శ్రీ పాదునికి జయ విజయీభవ దిగ్విజయీభవ! శ్రీ, ! శ్రీ,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ శ్రీవిజయీభవ.
3..మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీ పాదా|
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండ శ్రీవిజయీభవ||
భా.సుమతీ తల్లి గావాత్సల్యామృతంతో పోషింపబడి, అన్ని దిక్కులనుంచి,అఖండ విజయం కలిగిన శ్రీపాదునికి జయ విజయీభవ దిగ్విజయీభవ ! శ్రీ,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ! శ్రీవిజయీభవ||
4..సత్య ఋషిశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా|
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండ శ్రీవిజయీభవ||
భా||.సత్య ఋషిశ్వరుడు అయిన బాపనార్య చే కీర్తిoపబడిన మనుమనిగా శ్రీ చరణుడికి అపరిమితమైన,అఖండ విజయం కల శ్రీ పాదునికి జయ విజయీభవ దిగ్విజయీభవ! శ్రీ,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ శ్రీ విజయీభవ!
5..సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రాసంభవా|
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండ శ్రీవిజయీభవ||
భా||. సవితృకాఠకచయనo యజ్ఞం యొక్క పుణ్యఫలoతో, భరద్వాజ ఋషి గోత్రంలో పుట్టిన శ్రీ చరణకి అద్భుత విజయం,అఖండ విజయుడు, విశ్వం జయుడు అయిన శ్రీ పాదునికి జయ విజయీభవ దిగ్విజయీభవ! ! శ్రీ,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ శ్రీవిజయీభవ!
6..దోచౌపాతీ దేవ్ లక్ష్మిఘన సంఖ్యాభోధిత శ్రీ చరణా|
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండ శ్రీవిజయీభవ||
భా ||. “దోచౌపాతీ దేవ్ లక్ష్మి”అంటూభిక్ష చేసి మార్పు చెందని దేవ సంఖ్య దోచౌపాతీ(2498 అనే దేవ సంఖ్య)2,4,9,8:,గాయత్రి మంత్ర అక్షరాలు24 ,9 అనగా శివరూపం,8 అనగా లక్ష్మి అనే సంఖ్య ను వివరించిన, సర్వ వ్యాపక విజయునికి శ్రీ పాదు నికి జయ విజయీభవ దిగ్విజయీభవ! శ్రీ,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ శ్రీవిజయీభవ!
7..పుణ్య రూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా|
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండ శ్రీవిజయీభవ||
భా||..పుణ్య రూపిణీ అయిన రాజమాంబ గారి కుమార్తె గర్భ పుణ్యఫల౦ వలన జన్మించిన శ్రీ పాదునికి జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ!,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ శ్రీవిజయీభవ!.
8.సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీ పాదా |
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండ శ్రీవిజయీభవ||
భా||.సుమతీ,నరహరి ల పుత్రునిగా మంచి జాతకము న జన్మించిన దత్తదేవ ప్రభు శ్రీ పాదునికి జయ విజయీభవ దిగ్విజయీభవ ! శ్రీ,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ శ్రీవిజయీభవ!.
9.పీఠికాపుర నిత్యవిహరా మధుమతి దత్తా మంగళరూపా|
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ,మదఖండ శ్రీవిజయీభవ||
భా||.మంగళ స్వరూపుడై , .పీఠికాపుర(పీఠపురం)నందు నిత్యం తిరిగే అమృత పురుషా,మధుమతి సమేత దత్త, శ్రీ పాదునికి జయ విజయీభవ దిగ్విజయీభవ ! శ్రీ,అఖండ మైన లక్ష్మిని కలిగిన ఓ పరమాత్మ శ్రీవిజయీభవ.!
ఫలస్తుతి :పవిత్రమైన సిద్ధ మంగళ స్త్రోత్రం పఠిoచిన అనఘావ్రతం చేసిన ఫలితం,సిద్ధ పురుషుల దర్శనం,స్పర్శ లభించును.సిద్ధులు సుక్ష్మరుపంలో సంచరిస్తారు.శ్రీ పాదల కృప కలుగుతుంది. తెలుగు అనువాదం రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి*
అవధూత చింతన గురుదేవ దత్త

No comments:

Post a Comment