అధ్యాత్మ జ్ఞానము కావాలి అంటే గురు సంప్రదాయం ప్రకారం గురు చరిత పారాయణ చెయ్యాలి. గురుచరిత్ర చదివితే యే అధ్యాయం ద్వారా ఎలాంటి ఉత్తమఫలితం కలుగుతుందో క్రింద సంక్షిప్త వివరణ ఇవ్వబడింది.
" శ్రీ గురుచరిత్ర - అధ్యాయములు - ఫలితాలు "
అధ్యాయము (1) - సద్గురు ప్రాప్తి.
అధ్యాయము (2) - దేవతా, గురు అనుగ్రహం.
అధ్యాయము (3) - విపత్తు నుండి రక్షణ.
అధ్యాయము (4) - సత్పుత్ర ప్రాప్తి.
అధ్యాయము (5) - లోకవంద్యుడగు పుత్రుడు కలుగును.
అధ్యాయము (6) - ఈశ్వరానుగ్రహ ప్రాప్తి.
అధ్యాయము (7) - పిశాచ, బ్రహ్మ రాక్షస బాధ నివారణ, మానసిక వాసనలు తీరును, పాపక్షయము, .
అధ్యాయము (8) - మాతా పితరులు చేసిన దోషములు హరింపబడును, శతృక్షయము, ఈశ్వరానుగ్రహం.
అధ్యాయము (9) - గురుకృపచేత ఉత్తమస్థితి.
అధ్యాయము (10) - ఉపద్రవ, ఉపఘాతకములు నివారింపబడును.
అధ్యాయము (11) - జన్మ, నామ నక్షత్రాది దోషనివారణ, సంతాన ప్రాప్తి.
అధ్యాయము (12) - జ్ఞాన ప్రాప్తి.
అధ్యాయము (13) - ఉదరశూల నివృత్తి, ఆరోగ్య ప్రాప్తి.
అధ్యాయము (14) - సర్వాపద నివారణ, సంకట నివారణ.
అధ్యాయము (15) - సకల తీర్థయాత్రాస్థల సిద్ది. అధ్యాయము (16) - పెద్దలయెడల చూపిన అవజ్ఞానదోషము హరించును, సద్గురు అనుగ్రహ ప్రాప్తి. అధ్యాయము (17) - విద్యా ప్రాప్తి.
అధ్యాయము (18) - దారిద్ర నాశనము, లక్ష్మి ప్రదము. అధ్యాయము (19) - విష శాంతి, కాశీ, గయ, ప్రయాగ యాత్ర ఫలం.
అధ్యాయము (20) & (21) - సంతానము నష్టమగుచుండు వారికి దీర్ఘాయుష్మంతుడైన పుత్ర ప్రాప్తి.
అధ్యాయము (22) - పాడి పంటలు సంవృద్దిగాంచును.
అధ్యాయము (23) - వాస్తు దోషములు పోవును, భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షస, యక్ష, శాకిని, ఢాకిని, గ్రహ బాధలు నశించును.
అధ్యాయము (24) - దుష్ట భావనలు తొలగి గురుని అనుగ్రహం లభించును.
అధ్యాయము (25) (26) & (27) - గర్వంతోకూడిన భావనలంతరించి, సద్బుద్ధీ, సద్గతులు లభించును.
అధ్యాయము (28) - ఖర్మ విపాక జ్ఞానము కలిగి, ఖర్మక్షయములకు కారణమగును. నిత్యకర్మానుష్టాన సత్ఫలము లభించును.
అధ్యాయము (29) - బ్రహ్మ రాక్షసి, పిశాచాదుల పీడ నశించును.
అధ్యాయము (30), (31) & (32) - మృత్యుంజయత్వము, చిరకాల సౌభాగ్య ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి (ఈ మూడు అధ్యాయములు ఒకే సారి పారాయణము చేయవలెను).
అధ్యాయము (33) - నీచ స్థితి నుండి ఉత్తమ జన్మ ప్రాప్తి, భగవదనుగ్రహ ప్రాప్తి.
అధ్యాయము (34) - తస్కర జ్వర నివృత్తి, గండనివారణ, ఆరోగ్య ప్రాప్తి, చిరంజీవత్వ సిధ్ధి.
అధ్యాయము (35) - ఈశ్వరానుగ్రహ ప్రాప్తి, సౌభాగ్యా సుమంగళిత్వ సిధ్ధి.
అధ్యాయము (36) & (37) - ఉత్తమ జ్ఞాన సిధ్ధి.
అధ్యాయము (38) - తాను తిని ఇతరులకు పెట్టు శక్తి లభించును.
అధ్యాయము (39) - సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి కాగలదు.
అధ్యాయము (40) - కుష్టు బాధ నివారణమగును.
అధ్యాయము (41) & (42) - గురు భక్తి సిధ్ధింఛును, గొప్ప స్థితి లభించును, కాశీయాత్ర ఫలము.
అధ్యాయము (43) - శ్రీ మహావిష్ణుని అనుగ్రహ ప్రాప్తి, సర్వదోష శాంతి.
అధ్యాయము (44) - శ్రీశైల యాత్ర ఫలసిధ్ధి
అధ్యాయము (45) - చర్మరోగ హరం, శ్రీగురుని అనుగ్రహ సిధ్ధి, విద్యా ప్రాప్తి.
అధ్యాయము (46) - సర్వాభీష్ఠ సిధ్ధి.
అధ్యాయము (47) - మనోరధ సిధ్ధి.
అధ్యాయము (48) - గురు అనుగ్రహము, ధన ధాన్య సంవృద్ది.
అధ్యాయము (49) - పాప వినాశనము, సర్వ తీర్థ దర్శనఫల ప్రాప్తి.
అధ్యాయము (50) - పూర్వ జన్మ జ్ఞానం, శ్రీ గురుని అనుగ్రహం
అధ్యాయము (51) - శ్రీ గురుని అనుగ్రహం కలుగును.
...అవధూత శ్రీ బోధానరేంద్ర సరస్వతీ స్వామి
No comments:
Post a Comment