Monday 16 November 2020

అల్లరి దత్త లీల 🙏🏻🙏🏻

 అల్లరి దత్త లీల 🙏🏻🙏🏻

🌺🙏🌹🌸🌼🌹🌷🌻



1897లో పెట్లాడ్ లో చాతుర్మాస్యం తరువాత శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు చిక్లాడ్ అనే ప్రదేశంలో భక్తుల కోరిక మేరకు యోగశాస్త్రములు భోదిస్తూ దీపావళి దాకా నివసించారు. దీపావళి రోజున దత్త స్వామి, శ్రీ మహరాజ్ ని తనకు మంగళస్నానము ( పవిత్రమైన, సుగంధభరితమైన వేడి నీటితో స్నానం) చేయించమని ఆఙ్ఞా పించారు. కానీ శ్రీ మహరాజ్ తాను సన్యాసిని అయినందువలన అగ్నిని కాని, సుగంధ ద్రవ్యములను కాని తాకను అన్నారు. తరువాత రోజున యథాప్రకారంగా, రోజు మాదిరిగానే చన్నీటితో స్నానం చేయించి విభూతి పూసారు. మధ్యాహ్నం నైవేద్యము సమయంలో నైవేద్యము సమర్పించబోగా చాలా పెద్ద ఉరుము వంటి శబ్దముతో కూడిన గొంతుతో దతస్వామి, " నాకు మంగళ స్నానం చేయించకుండా నైవేద్యము ఇవ్వటానికి ఏమిటి? నేను నర్మదా నదిలో కూర్చుని వున్నాను. నాకు నీ నైవేద్యము అవసరం లేదు, " అన్నారు. వారు పరుగున నర్మదా తీరం చేరగానే ఒక పసిపిల్లవాడి ఏడుపు వినపడింది. ఆ వైపునకు వెళ్లగా ఒక కాంతి వారిని విగ్రహం వున్న వైపుకు తీసుకుని వెళ్లింది. విగ్రహం చూడగానే స్వామి వారు నదిలో దూకి, కన్నుల నిండా నీళ్ళు నిండగా, హృదయమునకు హత్తుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చిరి. ఈ లోపుగా వారు నదివైపు ఎందుకు వెళ్లారో తెలియని భక్తులు అంతా అక్కడకు వచ్చారు.దతస్వామి ఆఙ్ఞ తెలుసుకుని వేడి నీళ్ళు, సుగంధ ద్రవ్యములను తెచ్చారు.అప్పుడు వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు  ఆ నీటితో అభిషేకము నిర్వహించారు. అప్పుడు మహరాజ్ ఈ విధముగా ఆనందంతో పరవశించి, స్తోత్రం చేశారు. 


 శ్లో: మిత్ర మిత్ర జరి భాండతీ! తరిపుహ్నం ఏక హోతీ !

దంపతీచా హో కలహా!లవమాత్ర న తుటే స్నేహ!

దేవభక్తాంచే భాండణేం!పరాభక్తీచేం తేం ఠాణేం!

వాసు హ్మణే హా వినోద! దేతో దత్తా పరమానంద ॥

భావము: స్నేహితులు ఇద్దరు  కలహించుకున్నను కొంచెoకూడా స్నేహం చెడదు. దంపతులు ఘర్షించు కున్నను వారి మధ్య ప్రేమ చెడకుండా ఒకటవుతారు. అలాగే స్వామి కి, భక్తునికి మధ్య వున్న సంఘర్షణ అతిశయించు ప్రేమకు గుర్తు. ఈ విధంగా దత్తుడు నాకు పరమానందాన్ని ఇస్తున్నారు, అని వాసుదేవుడు సంతోషంగా చెప్తున్నాడు. 

🌻🌷🌹🙏🏵️🌸🌼

No comments:

Post a Comment