Saturday, 7 November 2020

గురు చరిత్ర అధ్యాయం-7..🙏🏻

 దత్త లీలా క్షేత్ర మహత్యం


గురు చరిత్ర


సాధనా  గుప్త భావం...

అధ్యాయం-7..🙏🏻

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

మనం సాధన చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న గురువు మనల్ని సరి అయిన విధాన మార్గంలో ఎలా పెడతారు? 


అవసరం అయితే మనకున్న శాపాలు, పాప కర్మలు, సాధనా పరమైన అడ్డంకులు ఎలా తొలగించి మనకు ఉన్న శాపాలు తాను ఎలా భరిస్తారు, ఇలా ఆ భక్తవత్సలుడు గురించి తెలుసుకొనే అధ్యాయం ఇది.

ఇలా మనలో అనేక మార్పులు రావడం మొదలు అవుతుంది.


గురువు  మనకు వచ్చిన కష్టాల వంకతో  భక్తులకు ఎలా మంచి చేయాలి? ఎలా సన్మార్గంలో పెట్టాలి అని గురువు ఆలోచిస్తారు. మనకు కష్టాలు తొలగిపోవడంతో మనసు నిర్మలం అయి కొద్ది కొద్దిగా చెడు ఆలోచనలు దూరం అయి లోక కళ్యాణ కరమైన ఆలోచనలు ప్రారంభం అవుతాయి. అందరిలో ఆ భగవంతుని చూసే సాధన మొదలు అవుతుంది.ఈ అధ్యాయం భక్తితో,శ్రద్ధగా  పఠించిన వారికి ఈ అనుభవం కలుగుతుంది.ఈ అధ్యాయం యొక్క లక్ష్యం అదే.

జై గురు దత్త.

No comments:

Post a Comment