Tuesday 10 November 2020

గురునాధ్ మహరాజ్ దండవతే..🙏🏻

 మహాత్ముల పరిచయం-378


గురునాధ్ మహరాజ్ దండవతే..🙏🏻

హైదరాబాద్ కు చెందిన శ్రీ రామారావు,సీతామాయి దంపతులకు 60 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లలు లేరు. అదే కోరికతో వారు గాణ్గాపూర్ వెళ్లి,తీవ్ర సాధన చేశారు. రోజూ సంగమంలో వేకువఝామున లేచి రామారావు గురుచరిత్ర పారాయణ చేయగా,ఆమె అక్కడే గల ఔదుంబర్ కి ప్రదక్షిణలు చేస్తూ,మధ్యాహ్నానికి
నిర్గుణ పాదుకా మఠం చేరి,అక్కడ మధుకరి చేసుకొని, దత్త భిక్ష ప్రసాదం తిని మళ్ళీ సంగమం వచ్చి పారాయణ చేసి,మళ్ళీ పల్లకి సేవలో పాల్గొనేవారు.
ఒకసారి వారికి శ్రీ నృసింహ సరస్వతి దర్శనం ఇచ్చి తల్లీ!నీ కోరిక తీరబోతోంది,మీరు గొడ్రాలు కాదు అని రెండు ఖర్జూరాలు ఇచ్చి ఆశీస్సులు అందించారు. నిజంగానే వారి చేతిలో రెండు ఖర్జూరాలు ఉన్నాయి. ఆ దంపతులకు 31-జనవరిలో-1907 సంవత్సరం లో రామారావు గారి 62 ఏట శ్రీ గురునాధ్ మహరాజ్ దండవతే జన్మించారు. వీరు చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో గల శ్రీ బాలకృష్ణ నంద(పాండురంగ స్వామి శిష్యులు వీరు)స్వామిని సేవించారు.అలా వీరి 24 ఏట శ్రీ బాలకృష్ణానంద వీరికి ఆశీర్వాదం ఇస్తూ, తనకు గాయత్రి సాధన చేయాలని వుంది, కానీ ఈ జన్మ లో సాధన చేయలేక పోయాము, అందుకే గురునాధ్ రూపంలో చేయబోతున్నాను అన్నారు. వారి నోటిలో నించి ఒక అగ్నిగోళం వచ్చి,గురునాధ్ మహరాజ్ నోటిలోకి వెళ్లింది. వెళ్ళగానే తన గురువు బాలకృష్ణ నంద మహరాజ్ సమాధి చెందారు. అప్పటి నుంచి వీరు 24 లక్షల గాయత్రి పునశ్చరణ చేసి,111 సార్లు సత్యనారాయణ వ్రతం చేసి,108 భగవత్ సప్తాహలు వివిధ ప్రాంతాల్లో నిర్వహించి ప్రజలలో భక్తి చైతన్యం తీసుకొచ్చారు. ఉదయం లేచి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ, మధ్యాహ్నం గురుచరిత్ర పారాయణ , గోసేవ, ప్రసాద వితరణం,సాయంత్రం మళ్ళీ పారాయణ,రాత్రి భజనలు అలా రోజు మొత్తం భగవంతుడి స్మరణలో ఉండేవారు. వీరిని ఎవ్వరు తాకకూడదు అనే నియమం ఉండేది. అందుకే ప్రతి ఊరు నడచి వెళ్లేవారు. తిరుపతి,బదరి ,గాణ్గాపూర్ ఇలా నడచి వెళ్లేవారు. గాణ్గాపూర్ లో భిక్షాటన, అతిధి సేవ చేసేవారు. ఒకసారి కుమారుని గాణ్గాపురముు సంగమం లో గురుచరిత్ర పారాయణ,గాయత్రి చేయమని ఆదేశించారు. వారి అబ్బాయి అక్కడ మొదటి పారాయణం అనంతరం అక్కడ సుగంధ పరిమళాలు వ్యాపించాయి. రెండవ పారాయణ తో తన శరీరం నుంచి కూడా రావడం జరిగింది.మూడవ పారాయణతో దత్తాత్రేయ స్వామి నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా ఈ ప్రసాదం తీసుకో అనే దివ్య వాణి వినపడి నిర్గుణ పాదుకలు వద్ద దత్తాత్రేయ దర్శనం లభించింది.31/8/1985 సంవత్సరం లో గురునాధ్ మహరాజ్ సమాధి చెందారు.

No comments:

Post a Comment