Saturday 7 November 2020

శ్రీవిఠాబాయి మెదర్కార్...🙏🏻🙏🏻

 మహాత్ముల పరిచయం-377


శ్రీవిఠాబాయి మెదర్కార్...🙏🏻🙏🏻

Rajyalakshmi srinivas boddu palli.

శ్రీ అక్కలకోట స్వామి ఆదేశం మేరకు శ్రీస్వామిసుత కొల్హాపూర్ లో స్థాపించిన పీఠానికి పీఠాధిపతి ఈమె. శ్రీ ధోoడోబా దంపతులకు ఏకాదశి రోజు,

 9-జులై-1870, సంవత్సరం లో జన్మించారు. తండ్రి గారు దత్తాత్రేయ భక్తులు. నృసింహ వాడి తరచూ వెళ్లేవారు. పాపకు పుట్టకతోనే కళ్ళు కనిపించేవి కాదు. జాతకం ప్రకారం పెద్ద యోగిని అవుతుందని,చిన్నప్పుడే మృత్య గండం ఉందని, భగవంతుని దయ వలన భగవత్కార్యం కోసం  జన్మించిందని, మృత్య గండం వున్నా అదే పోతుంది అని ఉంది.తల్లి దండ్రులు దిగులు పడి ప్రతి పుణ్యక్షేత్రం తిప్పుతూ,నృసింహ వాడీకి కూడా తరచూ తీసుకెళ్లేవారు. కారణం మహనీయులు మాత్రమే తమ బాధ తీర్చగలరు అని. పాప మాత్రo నిరంతరం దత్త నామస్మరణతో ఆనందంగా ఉండేది. ఒకరోజు నృసింహవాడి లో తండ్రి గారికి స్వప్నం లో దత్త స్వామి కనపడి, త్వరలోనే నీకు దర్శనం ఇస్తాను. నీ కోరిక తీరుస్తాను కానీ నేను చెప్పింది నువ్వు వినాలి అని చెప్పి అంతర్ధానం అయ్యారు. తండ్రి గారికి చాలా ఆనందం కలిగింది. కొద్ది రోజుల్లో వారు కొల్హాపూర్ దగ్గర ఒక అమ్మ వారి  జాతరకు వెళ్లి, పాపతో అక్కడ తిరుగుతున్నారు. ఎక్కడినించో శ్రీ స్వామి సుత(అక్కలకోట స్వామి చే ఉద్ధరింపబడిన వారు,వారి చరిత్ర లో వున్నారు) శిష్యులు అయిన బ్రహ్మానంద స్వామి కుమార్ బ్రహ్మ తేజస్సుతో  వీరికి అడ్డంగా వచ్చి నుంచున్నారు. తండ్రి గారికి అర్ధం కాలేదు. వెంటనే స్వామి కుమార్ పాప కి కళ్ళు కనపడవు కదా, స్వామి సమర్ధ ప్రసాదిస్తారు. కానీ పాపని మాకు ఇచ్చేయ్యాలి అన్నారు. మొదట ఆశ్చర్యం పోయిన తరువాత తేరుకొని నృసింహవాడి లో దత్త ఆజ్ఞ గుర్తుకు వచ్చి వప్పుకున్నారు. స్వామి కుమార్ పాపని తీసుకొని అక్కలకోట వెళ్లారు. అక్కడ పాప స్వామి సమర్ధ సమాధి మందిరంలో కూర్చొని రోజు అంతా

ఏడుస్తూ వుంటుంది.రాత్రికి పాపకి కళ్ళు వచ్చాయి. దానితో పాపని తీసుకొని శ్రీ కొల్హాపూర్ దగ్గర ముంబా పూర్ కు తెచ్చి పీఠాధిపతిని చేశారు.అమ్మ ఎన్నో దివ్యలీలలు చేశారు. నిరంతరం మౌనంగా జపమాల తిప్పుతూ స్వామి సమర్ధ, దత్త నామజపం చేసేవారు. ఎందరో మహానుభావులు అమ్మని "సిద్ద మహరాజ్" అని పిలిచేవారు. సమాధి వివరాలు తెలియలేదు.

జై గురు దత్త.

No comments:

Post a Comment