Monday 9 November 2020

గురుచరిత్ర గుప్త బోధ... అధ్యాయం-10&11..

 దత్త లీలా క్షేత్ర మహత్యం...

గురుచరిత్ర 

గుప్త బోధ...

అధ్యాయం-10&11..🙏🏻

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

సాధకులు (మనము) తన సాధనలో ముందుకు వెళ్లే కొద్ది వారిలో ఉన్న అధర్మం,పాపాలు,దుష్కర్మలు ఒక్కటొక్కటే నశించిపోయి మనలో  కొత్త అవతారం అయిన ధర్మం, పుణ్యం, సత్కర్మలు ఉద్భవింప జేసుకోవడము,వాటి పట్ల ప్రేమ పెరగడం ,ఆచరించడం ఎలాగో ఈ అధ్యాయం తెలుపుతుంది.


 సాధనలో మాయ అనే గజదొంగ, అజ్ఞానంతో కలిసి మనల్ని, మన మోక్ష ఆసక్తి అనే సంపదను  దోచుకోవడానికి వచ్చినప్పుడు గురు అనుగ్రహముతో తప్పించుకుని, సాధనలో ఎలా ముందుకు వెళ్ళాలి, మనలోని అజ్ఞానం  భగవంతుని మీద మనకు శ్రద్ద పెరిగేకొద్దీ  భగవంతునిచే ఎలా చంపబడుతుంది,అన్ని అడ్డంకులను సాధనతో, గురు అనుగ్రహముతో తొలగించుకుని సాధన కొనసాగించాలి అని తెలుపుతుంది. 


కానీ ఇక్కడ దత్తుడు తన తల్లికి  తన నిజ స్వరూపం చూపి,తల్లి అజ్ఞానం,మొహం  ఎలా రూపు

మాపుతారో,అలాగే ఉపదేశం ద్వారా ఈ ప్రపంచంలో మోహము,తగదని ఉపదేశించి, తన నిజస్వరూపం మరలా మరల మనకు కూడా గుర్తు చేసి,మనం పొందవలసిన స్థితిని గుర్తు చేస్తారు, ఈ అధ్యాయం లో.

No comments:

Post a Comment