Saturday, 24 October 2020

శ్రీ కినారామ్ అఘోరీ..🙏🏻

 మహాత్ముల పరిచయం-356

శ్రీ కినారామ్ అఘోరీ..🙏🏻

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి

మనసా దేవి,అక్బర్ సింగ్ లకు 1601 సంవత్సరంలో జన్మించి 171 సంవత్సరాల పాటు జీవించి, శ్రీ సంత్ తులసీ దాస్ కు సమకాలీనంగా ఉంటూ, దత్తాత్రేయ సాంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వారు.

చిన్నప్పుడు వటవృక్షo క్రింద కూర్చొని తీవ్ర తపస్సు చేశారు.చిన్నతనంలోనే గొప్ప మహనీయుల లక్షణాలు ఉండేవి.12వ ఏట పెళ్లి అయింది. భార్య అత్తగారింటికి వస్తూ చనిపోయింది. తరువాత గురు అన్వేషణ ప్రారంభించి కాశీ దగ్గర శివరాం మహరాజ్ వద్ద చేరి అనన్య సేవ చేశారు. ఒకరోజు గురువు గారు వీరిని తన పూజా సామాను మొత్తం గంగా నది ఒడ్డుకు తెమ్మని అడిగారు. ఇద్దరూ గంగా నది ఒడ్డుకు చేరగానే గంగా మాత పైకి వచ్చి కినారామ్ గారి పాదాలు కడిగింది. గురువు గారు తన శిష్యులు జన్మతః జ్ఞాని అని తెలుసుకున్నారు.

తరువాత కొద్ది రోజులకు దేశాటన, గిరినార్ యాత్రకు వెళ్లిన వీరికి గోరక్ష నాధ్ దర్శనం లభించింది. ధునిని దర్శించి గిరినార్ కు ప్రదక్షిణానికి బయలు దేరి,ఒక అడవిలో చిక్కుకున్నారు. హే!గిరినారీ!మీ మీద నమ్మకం ఉంది అని 3 సార్లు అరిచారు. పక్కనే ఒక యోగి(దత్తాత్రేయ  స్వామి) ధుని వేసుకొని కూర్చొని , వీరిని పిలిచి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?అని అడిగారు. తీవ్ర ఆకలితో ఉన్న వీరికి అడగకుండానే ధునిలో నించి 4 దుంపలు పట్టకారతో నోటిలో వేశారు. వీరు తినగానే దాహం,ఆకలి పోయి ఆలౌకిక స్థితి కలిగింది. దత్తాత్రేయ స్వామి వీరికి కుడి చెవిలో అఘోరీ మంత్రం ఉపదేశించి, అవధూత సంప్రదాయం, తత్వ శాస్త్రం,వైదిక జ్ఞానం తెలియజెప్పి,తల మీద చేయి పెట్టి శక్తి పాతం చేయడంతో ప్రశాంత సమాధి స్థితి కలిగింది. దత్త స్వామి  వీరిని దేశాటన చేసి,కాశీలో స్థిరపడమని ఆజ్ఞ ఇచ్చారు. వీరు దేశాటన చేసి,కాశీ వచ్చి అధ్భుత మహిమలు చేశారు. వీరి శరీరం నుంచి సువాసనలు వెదజల్లుతుండేవి. సమాధికని ముందుగా  తెలియజేసి, దత్తాత్రేయ ధ్యానంలో ఉండి,3 సార్లు ప్రణవం ఉచ్చారణ చేసి 1772 లో సమాధి చెందారు. ఇప్పటికి ఒక నిర్ధిష్ట సమయంలో వీరి సమాధి దగ్గర సువాసనలు వచ్చి సమాధి నుంచి ఆకాశంలో కి వెళ్ళిపోతారు. అప్పుడు అందరూ రాత్రి పూట అక్కడ సంగీతo వినవచ్చు.

జై గురు దత్తాత్రేయ.

Address:పండిట్ మన్మోహన్ మలవియ రోడ్,near hotel bordway, ఆనంద బాగ్, భేలుపుర్, వారాణసి,221001.

No comments:

Post a Comment