దత్త లీలా క్షేత్ర మహత్యం
వాసుదేవ లీలామృతం
రచన:శ్రీ రంగావధూత
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
Part_17
నమో గురవే వాసుదేవాయ!
చాతుర్మాస్యంలో స్వామి వారి కార్యక్రమాలు!
శినోరీ లో బిక్ష స్వీకరించుట స్వామి మహరాజ్ శినోరే గ్రామంలో బిక్షకు వెళ్లేముందు శ్రీ పేండారకర అనే శిష్యులు స్వామికి దక్షిణాది బ్రాహ్మణుల ఇల్లు చూపేవారు. శిష్యుడు ముందు నీళ్ళు నిండిన గ్లాసుతో నడుస్తూ వుంటే స్వామి వారు వెనుక నడిచేవారు. ఇంటి ముందుకు వెళ్ళగానే శిష్యుడు నేలను నీళ్ళతో శుభ్ర పరచేవాడు. స్వామి వారు దానిమీద నుంచుని బిక్ష స్వీకరించేవాడు. ఇలా మూడు ఇళ్ళలో స్వీకరించేవారు. తిరిగి వచ్చేటప్పుడు జోలెను నర్మదా నీటిలో ముంచి తెచ్చేవారు. మందరంలోకి వచ్చాక శ్రీ పేండారకర తల్లి గారు ఆవుపేడతో అలికిన ప్రదేశంలో జోలెను వుంచేవారు. బిక్షను మూడు భాగాలుగా విభజించి, ఒక భాగం నర్మదా మాతకు, మరొకటి ఆవులకు, పెట్టి మూడవ భాగం వారు స్వీకరించేవారు. రజస్వల అయిన స్త్రీలు ఎదురు వస్తే ఆ రోజు బిక్ష స్వీకరించేవారు కాదు. శ్రీ పేండారకర గారి సాత్వికమైన స్వభావం చూసి స్వామి వారికి ఒక మంత్రం అనుగ్రహించారు. తరువాత వారికి మంచి ఉద్యోగం లభించి, స్వామి కృప వలన మామలతదార్ పదవి దాకా చేరుకున్నారు. ఈ విధంగా మహనీయులకు చేసిన సేవ లౌకికమైన, పారమార్ధికమైన రెండు రకాల లాభాలను ప్రసాదిస్తుంది
దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర.
No comments:
Post a Comment