దత్త లీలా క్షేత్ర మాహాత్యం
వాసుదేవ లీలామృతం
రచన:రంగావధూత
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి
Part-20
నమో గురవే వాసుదేవాయ!
భక్తుల పై స్వామి వారి అనుగ్రహం!
కేశవరావు.....
కేశవరావు అనే పేరగల ఒక నాస్తిక భక్తుడు వుండేవారు. వీరి గురించి శ్రీ రంగావధూత విరచిత శ్రీ గురులీలామృతంలో వుంది. ఇతను డాక్టర్. పూణె నివాసి. మహరాజ్ ను బిక్షకు పిలవగా, నీవు బ్రాహ్మణ ధర్మాలు ఏవీ ఆచరించుట లేదు, మీ ఇంటికి రాననిరి. ఇతను వివాహితుడైనప్పటికీ భార్యను కాపురానికి తీసుకుని వెళ్ళకుండా సారంగాపూర్ అనే వూరిలో నివషిస్తుండగా, ఆ విషయం తెలిసిన మామగారు పిల్లను తెచ్చి దింపి వెళ్లారు. తరువాత ఒక కొడుకు పుట్టాడు. అతను ఐదవ ఏటనే ఒక యోగి లాగా అందరికీ చెప్పి మరణించాడు. తరువాత అతని భార్య కూడా, నేను కూడా తోందరలో పండరిలో దేహత్యాగం చేస్తాను అని చెప్పి, అలాగే చేసింది. ఈ తల్లి కొడుకులు పూర్వజన్మలో యోగభ్రష్టులై జన్మించారు, వీరు సామాన్యులు కారు అని అక్కడి వారు అతనితో చెప్పారు. తరువాత భార్య కోరిక మేరకు రెండవ వివాహం చేసుకున్నారు. ఇన్ని సంఘటనలు అతని జీవితం లో జరుగుతున్నా నాస్తికుడైనాడు. స్వామి వారిని దర్శించిన తరువాత అతనిలో మార్పు కలిగి స్వామి మనింటికి బిక్షకు వచ్చేవరకు అన్నం ముట్టనని తల్లితో ప్రమాణం చేసి స్వామి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. నియమ నిష్ఠలతో స్వామి వారు చెప్పినట్లు కర్మలన్నీ ఆచరించాడు. స్వామి వారు ఆనందపడి వాళ్ళ ఇంటికి బిక్షకు వెళ్లారు. ఈ విధంగా స్వామి వారి సత్సాంగత్యము వలన సన్మార్గంలోకి వచ్చి పరిపూర్ణమైన ఆస్తికుడు అయ్యాడు.
దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర.
No comments:
Post a Comment