Saturday 24 October 2020

గాణగాపురం లోని అష్ట తీర్ధాలు..🙏🏻

 దత్త లీలా క్షేత్ర మహత్యం


గాణగాపురం లోని అష్ట తీర్ధాలు..🙏🏻

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


1&2- షట్ కుల& నరసింహ తీర్థం:ఈ తీర్ధాలలో ఎవరైనా శ్రద్ద, భక్తితో స్నానం చేస్తే అకాల మృత్యువు, మరియు కాల మృత్యువు జరుగదు. శతాయుష్య వంతులు అవుతారు. ప్రయాగ లోల త్రివేణి సంగమం లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.

ప్రాంతం: సంగమంలో రెండు  నదులు కలిసే ప్రాంతంలో షట్ కుల తీర్థం ఉంది.ఈ తీర్థమునకు దగ్గరలో రెండవ తీర్థం అయిన నరసింహతీర్థం ఉంది.


3. భాగీరథీ తీర్థం::- ఈ తీర్థంలో స్నానం చేస్తే సమస్త దరిద్రాలు నాశనం అయి కాశీ క్షేత్రంలో గంగా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.

ప్రాంతం: ఈ కుండము భీమానది కలిసే చోట ఉంది.


4. పాపవినాశిని::- ఈ తీర్ధంలో స్నాన మాత్రం చేతనే పాపరాశి దగ్ధం అవుతుంది. ఇక్కడ స్నానం చేయటంవలన సమస్త  పూర్వ జన్మల పాపం నశిస్తుంది. శ్రీ గురుని యొక్క  

పూర్వాశ్రమ సోదరి అయిన రత్న తెల్ల కుష్టు రోగం పోయింది.

ప్రాంతం: భాగీరథీ తీర్థమునకు 500 మీటరుల దూరంలో ఉంది.


5.కోటి తీర్థం::- ఈ తీర్ధంలో స్నానం చేస్తే ఆత్మశుద్ది కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది. మరియు జంబుద్విపంలో కల అన్ని తీర్ధాలలో స్నానం చేసిన అనంతమైన  పుణ్యం లభించి, శక్తి కొలది దానం చేస్తే కోటి దానాల ఫలితం లభిస్తుంది.

ప్రాంతం: దండవతే మహరాజ్ మఠం కు ఎదురుగా ఉంది.

6.రుద్ర తీర్థం::- ఈ తీర్థం "గయ"తో సమానం. గయలో చేసే సర్వ ఆచరణలు అయిన పూజలు, కర్మలు, ఇక్కడ చేస్తే కోటి జన్మల పాపం ,దోషం నశిస్తుంది.

ప్రాంతం: కోటి తీర్ధంకు కొద్దీ దూరంలో ఉంది.


7.చక్ర తీర్థం::- ఈ తీర్థం ద్వారావతి(ద్వారక)తో సమానం. ఇక్కడ స్నానం చేసి కేశవ మందిరంలో పూజ చేస్తే ద్వారకలో చేసిన పుణ్య స్నానాలు, పూజల కన్నా నాలుగు  రెట్లు పుణ్యం లభించి,అజ్ఞానికి జ్ఞానం లభిస్తుంది.

ప్రాంతం: కేశవ,చక్రేశ్వర్ మందిరం పక్కన ఉంది.


8.మన్మధ తీర్థం::- ఇక్కడ స్నానం చేసి,ఇక్కడే ఉన్న కాళేశ్వరునికి పూజ చేస్తే వంశ అభివృద్ధి అయి, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

ప్రాంతం:: కాళేశ్వర్ మందిరం పక్కన ఉంది.

ఈ అష్ట తీర్ధాలలో నరక చతుర్దశి రోజు స్నానం చేయడం అతి పవిత్రం.

ఈ తీర్ధాలు దర్శించడానికి కాలి నడకన ఆరు గంటలు పడుతుంది. ఆటోలో మూడు  గంటలు పడుతుంది.

జై గురు దేవ దత్త.🙏🏻

No comments:

Post a Comment