Saturday 24 October 2020

యోగభ్రష్ట కన్యా....

 దత్త లీల క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:శ్రీ రంగావధూత.

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

Part-28


నమో గురవే వాసుదేవాయ!

భక్తుల పై స్వామి వారి అనుగ్రహం!

యోగభ్రష్ట కన్యా....

కాన్పూర్ లో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడు తన కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒక ఉద్యోగస్తుడితో వివాహం చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఆ కన్య తనకు ఉద్యోగస్తుడు కానీ, వ్యాపారం చేసుకుండేవాడు కానీ, వ్యవసాయం చేసుకుండేవాడు కానీ వద్దని, బిక్ష చేసుకుని తపస్సు చేసుకుంటూ జీవించే ఒక బ్రాహ్మణుడిని చూడమని చెప్పింది. ఇంత స్పష్టంగా కూతురు చెప్పిన తరువాత అతను ఆలోచనలో పడ్డాడు. అప్పుడు స్వామి వారి దగ్గరకు వెళ్ళి ఈ మొత్తం చెప్పి మార్గదర్శనం చేయమన్నాడు. స్వామి వారు, " నీ కూతురు పూర్వజన్మలో యోగభ్రష్టురాలైన ఆత్మ. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యవద్దు. ఆమెకి ఇష్టమైన వరుడు మీకు సునాయాసంగా దొరుకుతాడు" అన్నారు. కొద్ది రోజులు తర్వాత ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేసుకుంటూ, ఇతని ఇంటికి సమీపంలో వున్న ధర్మశాలలో దిగాడు. ఆ బ్రాహ్మణుడిని చూసిన ఆ కన్య, నా పెళ్ళి ఇతనితో చేయండి అని అడిగింది. తండ్రి అప్పుడు ఆ బ్రాహ్మణుడిని తన ఇంటికి భోజనానికి పిలిచి , తన కూతురిని వివాహం చేసుకోమని అడిగాడు. వెంటనే అతను స్పష్టంగా చేసుకోను అని చెప్పేశాడు.ఆ కన్య తండ్రి  స్వామి వారి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడు. స్వామి వారు ఆ బ్రాహ్మణుడిని పిలిపించి మధ్యవ్యర్తిత్వం చేశారు. ఈ కన్య తన మనసులో నిన్ను పతిగా బావించింది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే స్త్రీ హత్యా పాతకం చుట్టుకొంటుంది. ఈ కన్య ఒక మంచి భార్యగా, నీ కర్తవ్యం పూర్తి అయ్యేందుకు సహకరిస్తుంది, అన్నారు. ఆ బ్రహ్మచారి అప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఒక మంచి ముహూర్తం చూసి పెళ్ళి చేశారు. పెళ్ళి తర్వాత ఆమె తన భర్తతో పాటు తీర్థయాత్రలకు వెళ్లిపోయింది. 

దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర

No comments:

Post a Comment