దత్త లీలా క్షేత్ర మహత్మ్యం....🙏🏻
సమశ్లోకి నుంచి......
శ్లో::- యద్గృహే2 సౌ కథారమ్యా శ్రావ్యతే పఠ్యతే సదా!
నందతే శ్రీయుతం తస్య సుశీలం విమలం కులమ్ ॥
శ్లో::- శ్రీగరోఃకృపయా తత్ర రోగపీడాది నైవచ!
సప్తాహశ్రవణా త్సర్వ పాశ(ప)నాశోఽప్య సంశయం॥
భావం::- 🙏🏻
ఏ గృహంలో దత్తాత్రేయుల వారి ప్రతిరూపమైన ఈ గురుచరిత్ర నిత్యం పారాయణ చేయబడుతూ ఉంటుందో, ఆ గృహంలో సిరిసంపదలు
కోకొల్లలుగా ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళంతా ప్రశాంత మనస్కులై, సుచరిత్రులై సుఖసంతోషాలతో తులదూగుతుంటారు. దత్తాత్రేయావతారు లైన శ్రీనరసింహసరస్వతీస్వామి
వారి అనుగ్రహం వల్ల రోగాలు, బాధలూ, గ్రహ పీడలు దూరంగా పారిపోతాయి. ఈ గ్రంథాన్ని దీక్షతో సప్తాహ పారాయణం చేస్తే సర్వపాపాలు భస్మీపటలమౌతాయి. కనుక ఈ పవిత్ర గ్రంథాన్ని శ్రద్ధా భక్తితో పూజించి, పఠించి, అమృత స్వరూపులు కండి.
జై గురు దేవ దత్త.🙏🏻
No comments:
Post a Comment