దత్తపరమాత్మ
--------------------------------
సకల జగత్తుకి కారణమైన, మహాశక్తినే
స్రుష్టి, స్థితి, లయ అనే చర్యలకి కారణమైన అఖండ, అనంత, అవ్యయ శక్తే వివిధ దేవతల రూపంలో పిలువబడుతుంది.
ఆ మహా శక్తే దత్తపరమాత్మ.
అంటాం దత్తమార్గస్థులమైనమనం.
దత్తుడెలా పరమాత్మ?
---------------------------------
దత్తప్రభువుల రూపాన్ని చూస్తే, నాలుగు కుక్కలు, మూడు ముఖములు, ఆరు చేతులు, కామధేనువు, ఔదుంబర వ్రుక్షం క్రింద, దిగంబరరూపంతో దర్శనమిస్తున్నట్లు కనపడుతుంది.
రూపంవెనుక తత్వం
-------------------------------
నాలుగు కుక్కలు నాలుగు వేదాలు.
కుక్క విశ్వాసానికి చిహ్నం. అంటే, వేదాలు కూడా విశ్వాసంతో దత్తప్రభువులనే సేవిస్తున్నాయి. వారి చరణ సన్నిధిలోనే ఉంటాయి.
వేదాలు ఎవరిని స్తుతిస్తాయి? వేదాలు ఎవరిని కోనియాడుతాయి? వాటిని బోధించిన వాడినే. వాటి సారమైన వాడినే.
కనుక దత్త స్వామి పరమాత్మే.
ఇక ఆయనదగ్గరే ఆనాలుగు ఎందుకు కూర్చుని ఉంటాయి?
వాటి గమ్యం ఆ చరణాలే కనుక. అలానే వాటి జన్మస్థానం అదేకనుక.
మూడుముఖాలు
---------------------------
త్రిమూర్త్యాత్మకమైనవాడు దత్తదిగంబరులు
అందుకే మూడు ముఖాలు.
అంటే, జగత్తుయెుక్క స్రుష్టి, స్థితి, లయ అనే మూడింటినీ త్రిమూర్తుల రూపాన చేయు పరబ్రహ్మం దత్తనాధులే.
ఇందుకే వారిని మూడు ముఖాలతో చూపుతారు.
దేవతల రూపాలలో మనకి చూపె ముఖాలు, ఆదేవతలో ఉండే తత్వాలు.
చేతులలోని ఆయుధాలు వారు మనకి ప్రసాదించే శుభాలు అని పెద్దలు చెబుతారు.
ఇక దిగంబర రూపం
దిక్కులను అంబరము గా (వస్త్రాలుగా) కలిగి ఉన్నాడని, అంటే ఆయన సర్వవ్యాపకులని తెలుపుతూ మరే ఇతరములైన వస్త్రాలని కలిగిలేడనే, దగంబర పదం వచ్చింది.
జగత్తనే సంసారవ్రుక్షానికి ఆధారం దత్తమూర్తేనని తెలుపుతూ ఔదుంబర వ్రుక్షమూలంలో వారు ఉంటారని చెబుతారు.
వారి భక్తరక్షణా దీక్షాతత్పరతని తెలుపుతూ, కామధేనువు ఆయన వద్ద ఉంటుందని చెబుతారు.
"దత్తస్య ఆత్మ స్వరూపం " అంటూ నారదులవారు దత్తపరమాత్మమీద చేసిన ఓ స్తోత్రంలో అంటారు.
సకల జీవులలో ఆత్మ రూపంలో కోలువైన పరమాత్మ దత్తుడే అన్నదానికి మహర్షి వాక్యమే పరమప్రమాణం.
జయ గురుదేవ దత్త శ్రీ గురు దత్త
శ్రీ దత్త శరణం మమ
No comments:
Post a Comment