Saturday, 24 October 2020

కృష్ణా లహరి స్తోత్రం...

 దత్త లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:శ్రీ రంగవధూత

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


Part-25

నమో గురవే వాసుదేవాయ!

భక్తుల పై స్వామి వారి అనుగ్రహం!

కృష్ణా లహరి స్తోత్రం...

వాడీలోని బ్రాహ్మణులందరూ స్వామి వారిని గంగాలహరి మాదిరిగా కృష్ణానది మీద కూడా ఒక స్తోత్రం వ్రాయమని అభ్యర్ధించారు. కానీ స్వామి వారు దత్త భగవానుని ఆజ్ఞ లేకపోతే సాహిత్యానికి సంబంధించిన కృతి ఏదీ వ్రాసేవారు కాదు. గాణ్గాపూర్ వెళ్తుండగా కృష్ణా మాత స్వయంగా స్వామి వారికి దర్శనం ఇచ్చి కృష్ణా లహరి వ్రాయమని ఆదేశించింది. స్తోత్రం వ్రాస్తున్నప్పుడు కృష్ణా మాత స్వయంగా అక్కడే కూర్చుని వుంది. స్వామి మాతను చూస్తూ ఆ స్తోత్రం వ్రాశారు. ఈ స్తోత్రంలో స్వామి ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక విషయాలన్నీ పొందుపొరచారు. చివరి శ్లోకం(52) వ్రాయగానే కృష్ణా మాత 'చాలు' అని అంతర్థానం అయింది.

దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర.

No comments:

Post a Comment