Saturday, 24 October 2020

ధార్మిక స్థానాల యొక్క మరమ్మత్తులు, శుభ్రత....

 దత్త లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:రంగావధూత

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

Part_19

నమో గురవే వాసుదేవాయ!

భక్తుల పై స్వామి వారి అనుగ్రహం!

ధార్మిక స్థానాల యొక్క మరమ్మత్తులు, శుభ్రత....


స్వామి వారు కురుగడ్డ లో చాతుర్మాస్యం చేయాలనుకున్నారు. స్వామి వారు అక్కడికి రాక మునుపే కరువు ఏర్పడింది. స్వామి వారు వచ్చి భక్తులతో ఋష్యశృంగ మంత్రం అనుష్టానం చేయించారు. దీనివలన భారీవర్షాలు కురిశాయి. స్వామి అక్కడి పూజారి నుంచి బిక్ష స్వీకరించారు. అక్కడ పూజారుల ఇళ్ళు రెండు మాత్రమే వున్నాయి. పూజారులు నిష్ఠ లేనివారవడం వలన స్వామి వారికి, వారి నుంచి బిక్ష తీసుకోవటానికి ఇష్టపడలేదు. శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కనిపించి, రజకుడైన నాప్రియ శిష్యుడి ద్వారా దానమీయబడిన భూమి ఇది. ఆ ఆదాయం నుంచే మందిర ఖర్చు, నందదిపం యొక్క వ్యవస్థ జరుగుతున్నది. ఇది నాకు ఎంతో ఇష్టమైన స్థలము. మీరెందుకు ఇష్ట పడటం లేదు. ఇక్కడ ద్రవ్వశుద్ధి, భావశుద్ధి కలవు. అందువలన ఇక్కడ బిక్ష తీసుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నారు.  స్వామి మహరాజ్ అక్కడ ప్రతిదినం తపస్సు చేసుకుంటుండేవారు. సమాధి స్థితి లో ఎక్కువగా వుండేవారు. ఒకసారి వారి మీద ఒక చనిపోయిన పక్షి, కొన్ని పక్షి గుడ్లు, వాటి మలము పడ్డాయి. స్వామి వెంటనే లేచి శుభ్రం చేసుకున్నారు. అప్పుడు భగవాన్ దత్తాత్రేయ స్వామి వారితో, ఒక్కరోజుకే మీ పరిస్థితి ఇలా వుంటే, నా పరిస్థితి ఏంటి? రోజు నా మీద ఇలాంటి చెత్త పడుతున్నది. అది తెలియటం కోసమే ఈ పని చేశాను అన్నారు. అప్పుడు స్వామి వారు మందిరం చుట్టూ చూశారు. అక్కడ గుడ్లు, పక్షి మలము, చనిపోయిన పక్షులు కనపడ్డాయి. స్వామి వారు ఆ ప్రదేశం అంతా శుభ్రం చేశారు. విరిగి పోయిన తలుపును బాగు చేశారు. గోడలకు సున్నం వేశారు. ఈ విధంగా   పాత మందిరాలను శుభ్రం చేసుకోవాలని, లేకపోతే భగవంతుని మీద అపవిత్రమైన పదార్ధాలు పడతాయని చెప్పారు. ఆషాఢ మాసంలో కృష్ణా నది ఒక శూద్ర స్త్రీ రూపములో స్వామి దగ్గరకు వచ్చి నాకు తినటానికి పప్పు పెట్టు అన్నది. స్వామి మహరాజ్ ఆ సంవత్సరం దసరా పర్వదినాలలో మలప్రభా నదీ తీరంలో వున్నారు. వ్యాసపూర్ణిమ రోజు స్వామి వ్యాస పూజ చేశారు. సాయంత్రం కృష్ణా మాతకు పూజ చేశారు. గ్రామంలోని మహిళలకు, పిల్లలకు, పురుషులకు ఉడకపెట్టిన పప్పులను కృష్ణా మాత తృప్తి పడేట్టుగా పంచారు.

No comments:

Post a Comment