Saturday 24 October 2020

శ్రీ దుర్గ్ దత్త మందిరం,మాసోలి గ్రామం,గోవా.

 దత్త లీలా క్షేత్ర మహత్యం

దత్త క్షేత్రాలు-150.

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

శ్రీ దుర్గ్ దత్త మందిరం,మాసోలి గ్రామం,గోవా.

ఈ అలయంలో విగ్రహం ప్రతిష్ఠ మన తెలుగు వారు అయిన బ్రహ్మానంద సరస్వతి(విజయవాడ వారు)వాసుదేవనంద సరస్వతి అనుమతి తో చేశారు.

ఈ మందిర విశేషాలు

1.సామాన్య భక్తులకు కూడా ఇక్కడ దైవ శక్తి ఉంది అని తెలుస్తుంది.

2.ఈ మందిరం లో గర్భగుడి, హారతి ఇచ్చే ప్రాంతం,ప్రదక్షిణలు చేసే ప్రాంతం,మార్గం భూమి నుంచి 2 అడుగులు ఎత్తుగా ఉంటుంది. మందిర ప్రాంగణం వెనుక వైపు  లో ఔదుంబర్ వృక్షం,పురాతన దత్తాత్రేయ పాదుకలు ఉన్నాయి.

3.ఈ ఆలయంలో గర్భగుడి మొత్తం చెక్కలతో,సుందర శిల్పకళా వైభవంగా ఉంటుంది.

4.సుందరమైన ఏకముఖి దత్త,ఆరు చేతులతో ఎంతో అందంగా వున్నారు.

5.ఇక్కడ దత్తాత్రేయ స్వామి మంత్ర శక్తి,యోగశక్తి, నిఘాడ శక్తి కి అధిపతి. ఆలయ గర్భగుడి తలుపు లపై మానవుని లోని  కుండలినీ శక్తి కి సంభందించిన ఆరు చక్రాలు  చెక్కబడి ఉన్నాయి.వాటి గుండా దత్తాత్రేయ స్వామి ని.చూసి నప్పుడు మనకు కూడా స్వామి విగ్రహం లో అవే భాగాలు కనపడతాయి.ఇదొక అధ్భూతం.

దత్త స్వామి దగ్గరనాలుగు వేదాలు సూచించు 4 కుక్కలు బదులు బ్రహ్మ,అహం బ్రహ్మాస్మి,తత్వ మసి, అయమాత్మ బ్రహ్మ అని నాలుగు వేదాల సారం రాసి ఉంటుంది.

6.శంకర,దేవి,పాoడురంగడు,మాణిక్య ప్రభు,జ్ఞేనేశ్వర్,బాలవధూత ఇలా వారం రోజుల్లో ఒక్కోరోజు ఒక్కో అలంకరణ ఉంటుంది.

7.గురుచరిత్ర ని పరిశోధన/శుద్ధికరుణ జరిగిన ప్రాంతం ఇది.

జై గురు దత్త.

No comments:

Post a Comment