Monday 26 October 2020

శ్రీ గురుచరిత్ర మహిమ....

 శ్రీ గురుచరిత్ర మహిమ....

గురుచరిత్ర పారాయణ వలన మనకు కలిగే లాభాలు గంగాధర సరస్వతీ స్వామి వారు( గురు చరిత్ర వ్రాసిన మహనీయులు ) ఈ విధంగా తెలియచేశారు .....
శ్లో::- శ్రీ గురోశ్చరిత్రం ఖలు విస్తరేణ
మయోదితం కామధుగాదరేణ!
దారిద్ర్య పాపమయదావదానం యచ్ఛంతి కల్పద్రుమ సాంద్రదావమ్!!
భావం::- శ్రీ గురు చరిత్ర కామధేనువు. దారిద్ర్యము, పాపము, రోగములను హరించి,శాంతిని చేకూర్చే కల్పవృక్షం. ఇది పవిత్రమైంది. మనోహరమైంది.కనుకనే నిత్యం శ్రీ క్షేత్ర గానగపురం నందు వేలాది భక్తులు నిత్యం పారాయణ చేసి తరిస్తున్నారు
శ్లో::- లిఖింతి యే దో అపి గురోశ్చరిత్రం
పఠంతి వాయే పరమం పవిత్రం!
శృణ్వంతి వా చింతాహరం విచిత్రం
మోదంత ఏతే త్ర తధాపరత్ర॥
భావం::- శ్రీ గురుచరిత్ర పరమ పవిత్రమైనది. దీనిని ఎవరు వ్రాయుదురో, చదువుదురో, విందురో వారి చింతలన్నియు విచిత్రముగా హరింపబడును. వారు ఇహపర సౌఖ్యములు అనుభవింతురు. కలియుగమున గురు చరితం ప్రత్యక్ష ఫల దాయకమైనది.
ఎందరో భక్తులు నేటికీ స్వామివారి మహిమలను అనుభవిస్తూ ఉన్నారు. నిరంతరం స్వామి వారి నామాన్ని స్మరిస్తూ, గురుచరిత్ర పారాయణ తో తరిద్దాం....

No comments:

Post a Comment