Saturday 24 October 2020

పునర్వివాహం గురించి లేఖ...

 దత్త లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:శ్రీ రంగావధూత

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


Part-18


నమో గురవే వాసుదేవాయ!

భక్తుల పై స్వామి వారి అనుగ్రహం!

పునర్వివాహం గురించి లేఖ...

ఒకసారి పునర్వివాహాలు శాస్త్రసమ్మతమా కాదా, చేసుకోవచ్చా లేదా అనే విషయం మీద పెద్ద చర్చ అంతటా జరుగుతున్నది. అప్పుడు కొంతమంది స్వామి వారి దగ్గరకు వచ్చి ఖండిస్తూ ఒక లేఖ రాసి ఇమ్మన్నారు. స్వామి వారు లేఖ వ్రాయుటకు పెన్ను చేతిలోకి తీసుకుని వ్రాయటం మొదలు పెట్టగానే, పెన్ను కింద పెట్టు అని దత్త స్వామి ఆజ్ఞాపించారు. అందకని స్వామి వ్రాసి ఇవ్వలేదు. ఈ ఆచారాలు ప్రాంతం, మతం, సమయాలను బట్టి మారుతూ ఉంటాయి. ఒక సంవత్సరం తరువాత స్వామి వారు పేపరు, పెన్ను కనపడగా, " శ్రీ దత్త " అని వ్రాశారు. మళ్ళీ దత్త స్వామి ఆజ్ఞ జ్ఞాపకం వచ్చి పెన్ను కింద పెట్టారు. అప్పుడు దత్త స్వామి, దాని గురించి వ్రాయవద్దన్నాను కానీ, వేరేవి ఏమైనా వ్రాసుకోవచ్చు కదా, అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ స్వామి వారు తమ రచనలను మొదలు పెట్టారు.

No comments:

Post a Comment