దత్త లీలా క్షేత్ర మహత్యం
వాసుదేవ లీలామృతం
రచన:శ్రీ రంగావధూత
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
Part-21
నమో గురవే వాసుదేవాయ!
భక్తుల పై స్వామి వారి అనుగ్రహం!
దానం••••
ఒకసారి ఒక మహిళ స్వామి వారి దర్శనం కోసం వచ్చింది. ఆమె స్వామి వారి ముందు ఒక కొబ్బరి కాయ, దక్షిణగా పైకమునకు బదులు ఒక బంగారు నాణెం పెట్టింది. ఇది ఆమె మనస్ఫూర్తిగా కాక, పరధ్యానంతో చేసింది. స్వామి వారు అందరి మనసులు తెలిసినవారవటం వలన ఆ నాణాన్ని తీసుకో మన్నారు. ఒకసారి స్వామికి సమర్పించిన దానిని తిరిగి తీసుకుంటే అక్కడ వున్న భక్తులు ఏమనుకుంటారో అని అనుకుని ఆమె తీసుకోలేదు. కాని అయిష్టంగా సమర్పించిన దానిని భగవంతుడు తీసుకోడు. స్వామి వారు ఆ మహిళకు తిరిగి ప్రసాదం రూపంలో ఒక కొబ్బరి కాయ ఇచ్చారు. ఇంటికి వెళ్లి ఆ మహిళ కొబ్బరి కాయ పగలకొట్టి చూడగా అందులోనుంచి ఆ నాణెము బయటపడింది. ఆమె బంగారు నాణెం ఆమెకి దొరికింది. మనము మహనీయులకు సమర్పించే ఏ వస్తువయిన మన కష్టార్జితంతో పాటుగా శ్రద్ధా భక్తులతో, ఆనందంతో సమర్పించాలి. భగవంతుని దగ్గర అపారమైన ఖజానా వుంటుంది. మహనీయులు దానికి ప్రతినిధులు. కరుణాసముద్రులు. మనము ఏమీ ఇవ్వకపోయినా వారి కరుణ అలాగే వుంటుంది. ఈశ్వరార్పణ బుద్ధితో మనము ఏ వస్తువయినా సమర్పించాలి. అది మన ఆధ్యాత్మిక, లౌకిక ఉన్నతికి పనికి వస్తుంది. వారికి సమర్పించినది ఏదయినా మనకోసమే, వారి కోసం కాదు.
దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర...
No comments:
Post a Comment