Monday, 26 October 2020

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

 దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం, వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

శ్రీ గురుచరిత్ర మహిమ....

 శ్రీ గురుచరిత్ర మహిమ....

గురుచరిత్ర పారాయణ వలన మనకు కలిగే లాభాలు గంగాధర సరస్వతీ స్వామి వారు( గురు చరిత్ర వ్రాసిన మహనీయులు ) ఈ విధంగా తెలియచేశారు .....
శ్లో::- శ్రీ గురోశ్చరిత్రం ఖలు విస్తరేణ
మయోదితం కామధుగాదరేణ!
దారిద్ర్య పాపమయదావదానం యచ్ఛంతి కల్పద్రుమ సాంద్రదావమ్!!
భావం::- శ్రీ గురు చరిత్ర కామధేనువు. దారిద్ర్యము, పాపము, రోగములను హరించి,శాంతిని చేకూర్చే కల్పవృక్షం. ఇది పవిత్రమైంది. మనోహరమైంది.కనుకనే నిత్యం శ్రీ క్షేత్ర గానగపురం నందు వేలాది భక్తులు నిత్యం పారాయణ చేసి తరిస్తున్నారు
శ్లో::- లిఖింతి యే దో అపి గురోశ్చరిత్రం
పఠంతి వాయే పరమం పవిత్రం!
శృణ్వంతి వా చింతాహరం విచిత్రం
మోదంత ఏతే త్ర తధాపరత్ర॥
భావం::- శ్రీ గురుచరిత్ర పరమ పవిత్రమైనది. దీనిని ఎవరు వ్రాయుదురో, చదువుదురో, విందురో వారి చింతలన్నియు విచిత్రముగా హరింపబడును. వారు ఇహపర సౌఖ్యములు అనుభవింతురు. కలియుగమున గురు చరితం ప్రత్యక్ష ఫల దాయకమైనది.
ఎందరో భక్తులు నేటికీ స్వామివారి మహిమలను అనుభవిస్తూ ఉన్నారు. నిరంతరం స్వామి వారి నామాన్ని స్మరిస్తూ, గురుచరిత్ర పారాయణ తో తరిద్దాం....

దత్తపరమాత్మ

 దత్తపరమాత్మ

--------------------------------
సకల జగత్తుకి కారణమైన, మహాశక్తినే
స్రుష్టి, స్థితి, లయ అనే చర్యలకి కారణమైన అఖండ, అనంత, అవ్యయ శక్తే వివిధ దేవతల రూపంలో పిలువబడుతుంది.
ఆ మహా శక్తే దత్తపరమాత్మ.
అంటాం దత్తమార్గస్థులమైనమనం.
దత్తుడెలా పరమాత్మ?
---------------------------------
దత్తప్రభువుల రూపాన్ని చూస్తే, నాలుగు కుక్కలు, మూడు ముఖములు, ఆరు చేతులు, కామధేనువు, ఔదుంబర వ్రుక్షం క్రింద, దిగంబరరూపంతో దర్శనమిస్తున్నట్లు కనపడుతుంది.
రూపంవెనుక తత్వం
-------------------------------
నాలుగు కుక్కలు నాలుగు వేదాలు.
కుక్క విశ్వాసానికి చిహ్నం. అంటే, వేదాలు కూడా విశ్వాసంతో దత్తప్రభువులనే సేవిస్తున్నాయి. వారి చరణ సన్నిధిలోనే ఉంటాయి.
వేదాలు ఎవరిని స్తుతిస్తాయి? వేదాలు ఎవరిని కోనియాడుతాయి? వాటిని బోధించిన వాడినే. వాటి సారమైన వాడినే.
కనుక దత్త స్వామి పరమాత్మే.
ఇక ఆయనదగ్గరే ఆనాలుగు ఎందుకు కూర్చుని ఉంటాయి?
వాటి గమ్యం ఆ చరణాలే కనుక. అలానే వాటి జన్మస్థానం అదేకనుక.
మూడుముఖాలు
---------------------------
త్రిమూర్త్యాత్మకమైనవాడు దత్తదిగంబరులు
అందుకే మూడు ముఖాలు.
అంటే, జగత్తుయెుక్క స్రుష్టి, స్థితి, లయ అనే మూడింటినీ త్రిమూర్తుల రూపాన చేయు పరబ్రహ్మం దత్తనాధులే.
ఇందుకే వారిని మూడు ముఖాలతో చూపుతారు.
దేవతల రూపాలలో మనకి చూపె ముఖాలు, ఆదేవతలో ఉండే తత్వాలు.
చేతులలోని ఆయుధాలు వారు మనకి ప్రసాదించే శుభాలు అని పెద్దలు చెబుతారు.
ఇక దిగంబర రూపం
దిక్కులను అంబరము గా (వస్త్రాలుగా) కలిగి ఉన్నాడని, అంటే ఆయన సర్వవ్యాపకులని తెలుపుతూ మరే ఇతరములైన వస్త్రాలని కలిగిలేడనే, దగంబర పదం వచ్చింది.
జగత్తనే సంసారవ్రుక్షానికి ఆధారం దత్తమూర్తేనని తెలుపుతూ ఔదుంబర వ్రుక్షమూలంలో వారు ఉంటారని చెబుతారు.
వారి భక్తరక్షణా దీక్షాతత్పరతని తెలుపుతూ, కామధేనువు ఆయన వద్ద ఉంటుందని చెబుతారు.
"దత్తస్య ఆత్మ స్వరూపం " అంటూ నారదులవారు దత్తపరమాత్మమీద చేసిన ఓ స్తోత్రంలో అంటారు.
సకల జీవులలో ఆత్మ రూపంలో కోలువైన పరమాత్మ దత్తుడే అన్నదానికి మహర్షి వాక్యమే పరమప్రమాణం.
🙏జయ గురుదేవ దత్త శ్రీ గురు దత్త 🙏
🙏శ్రీ దత్త శరణం మమ🙏

సింధూర ధారణ

 1. ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.

2. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.
4. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
5. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతారు.
6. విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.
7. లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.
8. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.
9. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి🙏🙏🙏

శ్రీ దత్తాత్రేయల వారి రోజు వారి కార్యక్రమం

 *దత్తాత్రేయుడు*

*శ్రీ దత్తాత్రేయల వారి రోజు వారి కార్యక్రమం
* 1.నిద్ర- మహుర్ ఘడ్(మాతా పురం)200కి మీ నాగపూర్ నుంచి
*2.నివాసం -సహ్యాద్రి కొండలు..
*3.స్నానం-కాశి లో గంగలో
*4.ఆచమనీయం-కురుక్షేత్రం
*5.భస్మధారణ-దూత్ పపేశ్వర్(మహారాష్ట్ర)
*6.సంధ్యా వందనం-కర్ణాటక
*7మధ్యాణిక -గాణుగాపూర్.
* 8.భిక్ష -కొల్హాపూర్(కరవీర పురం),
*9 తిలకధారణ-పండరిపూర్
*10.భిక్ష స్వీకరించినది తినేది-పంచాలీశ్వర్(పుణే దగ్గర)
* 11.మంచినీరు త్రాగేది -తుంగభద్ర
*12.విశ్రాంతి-గిరినార్,
*13.స్త్రోత్రం, నామ జపము,ప్రశంసలు వినేది -బదరీనాధ్,
* 14.సాయంత్రం సంధ్య -పశ్చిమ తీరం.
*ఈ 14 స్థలములు శ్రీ దత్తాత్రేయ క్షేత్రములు.
*ఇక్కడ పారాయణ, నామ జపం,ధ్యానం ఎన్నోరోట్లు అధిక ఫలితాలు పొందుతారు.*

గోమాత ద్వాదశ నామ స్తోత్రం

 చాలా మంది మహిళలు #ఆవును_పూజిస్తుంటారు

కొత్త ఇంటి గృహ ప్రవేశానికి గోవును తిసుకోచ్చి నడి
ఇంట్లో ఉంచి దంపతులిద్దరూ పూజలు చేస్తారు
పవిత్రమైన ఆవును సాక్షాత్తు #విరాట్_స్వరుపంలో పోలుస్తారు
ఆవు ముఖంలో వేదాలు #కోమ్ముల్లో_శివకేశవులు
చివర #ఇంద్రుడు సుదురులో #ఈశ్వరుడు
చెవుల్లో #ఆశ్వనీ_దేవతలు కన్నుల్లో
#సూర్యచంద్రుడు కోలువుంటారు అని #ప్రతీతి
అదేవిధంగా దంతాల్లో #గరుత్మంతుడు
ఉదరంలో #స్కందుడు పశ్చిమభాగంలో #అగ్ని
దక్షిణభాగంలో #వరుణుడు_కుబేరుడు
ఎడమ వైపు భాగంలో #యక్షులు ముఖంలో #గంధర్వులు కోలువై ఉంటారు
అన్నిటికంటే ముఖ్యంగా గోమయంలో లక్ష్మీదేవి
ఉంటుందని శాస్త్రలు చెపుతున్నాయి
దేవతలందారు కొలువు ఉండే గోమాతను పూజిస్తే
అందరిని పూజించినట్టే అవుతుందని వేదాలు పండితులు చెపుతున్నారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏గోమాత ద్వాదశ నామ స్తోత్రం👏👏
👏ప్రథమం సురభీనమా👏
👏దిత్వీయం కృషివల్లభా👏
👏తృతీయం నందినీ నామ👏
👏చతుర్థిం క్షీరరూపిణి👏
👏పంచమం వైష్ణవ నామ👏
👏షష్టం బ్రహ్మపుత్రికా👏
👏సప్తమం యాజ్ఞరూపాచ👏
👏అష్టమం ధర్మవైభవా👏
👏నవమం వేదమాతాచ👏
👏దశమం తుష్టమానసా👏
👏ఏకాదశం శిష్టష్టా👏
👏ద్వాదశం భక్తవత్సలా👏
సర్వం శ్రీ గోమాత దివ్వచరణారవిందార్పాణమస్తు