Sunday 23 December 2018

VALUES AND MORALITY

VALUES AND MORALITY
It's been 4years since I have joined FB and it's been a previlage to know and get connected to some of most Beautiful souls ... extremely talented and highly intellectual ppl through out my journey here ...I always maintained dignity not only in my posts but also my attitude towards other person and treated every person with due respect..my interests were never been political ...religion...social life or any other absurd topics...always believed in growing mentally and spiritually ...being a person who has gone through so much struggles in life i tried to spread out only positivity and compassion..and a completely broken person only knows what it's likes to be feeling lost.. lonely or helpless..
I was never after looking for likes or praises..my likes and comments on other person posts too was irrelevant of if they liked mine or not...
There are ppl who earned my respect through their decent and compassion filled behaviour and feel me made good ..and I used think u get what u give..which all proved wrong. ..3days back
accepted a request of an aged (around60)person believing it belongs to a genuine person with a loving family and who posts decently
In seconds of accepting he had send 7..8 of messages...as I have not messenger in my phone I could not receive them just message notification was kept cuming..after few days I opened my inbox through computer..as one of my friend have said to be dropped a message and asked to look at it.. to only find his messages which were filled about only beauty..of how no one can compete with me in beauty...have not seen anywhere these kind of natural beauty and all that nonsense ..shared couple of my earlier dp pics too...what irked me the most is he offered his No too and asked to call me in free tym...
That tym I realised one should not assume the other person as a decent one by just seeing their posts about spiritual or moral values...or seeing their family pics
These are the ones one person should inherit by birth..i replied him that i felt very pity that he did not found any beauty in my posts..and sure not gone through my posts because if he would have gone through them then he would have realised what kind of person iam ...
Asked he himself having daughters what he might have felt if someone sends the same msgs to them too..how dare to ask a woman to call him..and said to him what it means to be actually Beautiful...
Having a decent and respectful behaviour makes u Beautiful
Having a heart filled with compassion makes one Beautiful
Having a spirit no matter of how many times it tested stood strong makes one Beautiful
And also dealing life struggles and obstacles with a positive attitude makes one Beautiful..
In the end I prayed that almighty to bless him with some of the wisdom and insight ...
Remember if a woman is accepting Ur request it's not because she has so much time to be in conversation with Ur absurd or rubbish talks..
And even if she sends a one it means that she respects u as a human being for Ur deeds or thoughts ...u did or expressed some where.
If she like Ur posts and put an amoji its bec she liked the post..not u..
Respect is the utmost thing for woman and if one can give it to her u won her respect too wholeheartedly..
ఈ నాలుగేళ్ల నా FB జర్నీ లో నాకు చాలా అందమైన వ్యక్తిత్వం అద్భుతమైన టాలెంట్ అత్యద్భుతమైన విజ్ఞాన వంతులను తెలుసుకునే.. వారితో పరిచయం పెంచుకుని ఎదిగే అవకాశం కలిగే భాగ్యం కలిగింది..నా హుందాతనం నేను ఎప్పుడూ నిలబెట్టుకున్నాను.. ఆ విధంగానే ఎదుటి వారిని కూడా తగు రీతి లోనే గౌరవించాను..నాకు ఆసక్తిగల అంశాలు ఎప్పుడూ పొలిటికల్ మతపరమైనవో అర్థం పర్దం లేని ఇతర విషయాలు కానే కావు ..మనిషి గా మానసికంగా ఆధ్యాత్మిక ఎదగాలని భావించాను..జీవితంలో ఎన్నో వేదనలు అనుభవించిన దానిని కాబట్టే ఎంతో కొంత స్పూర్తి దాయకమైన వాటినో లేదా ఆధ్యాత్మికతను పంచడానికే ప్రయత్నంచాను..ఎందుకంటే అంతులేని సమస్యలు ఒంటరిని చేసినప్పుడు దారి తెన్ను తెలియక చీకటిలో మగ్గిపోతున్నప్పుడు ఆ వ్యధ ఎలా ఉంటుందో బాగా తెలుసు కాబట్టే అలాంటివి పంచడానికి ఇష్టపడతాను..మన వలన ఒకరి పెదాలపైి చిన్న నవ్వు విరియాలి..అంతే కాని వాటికి లైక్స్ ఎన్ని వచ్చాయి అనేవాటి గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలేదు...నాకు వారు లైక్స్ పెడితేనే నేను వారికి పెట్టడం లాంటి పనులు నేను చేయలేదు.. కుదిరితే చదివి నచ్చితే లైక్ లేదా ఒక ఆత్మీయ మాటే నేను పాటించింది..అంతేగాని మాటలతో ఇతరులను ఎప్పుడు కించపరచలేదు.. నన్ను‌ఎంతో మంది తమ ఉన్నతమైన వ్యక్తిత్వం తో ఆకట్టుకున్నారు..మన హుందాతనం మన ప్రవర్తన బట్టే ఎదుటి వారి ప్రవర్తన ఉంటుందని భావించే నాకు అది తప్పని తర్వాత గ్రహించాను...
ఒక పెద్ద మనిషి అటూ ఇటూ అరవై ఉంటాయి.. రిక్వెస్ట్ పంపారు చూస్తే మొత్తం చక్కటి కుటుంబం మంచి భావాలు గల పోస్ట్ లే కనబడ్డాయి..సరే అనుకొని ఓకే చేసాక సెకండ్లలో మెసేజ్ మీద మెసేజ్ లు..నాకు ఫోన్లో మెసంజర్ లేదు కాబట్టి నేను చూడలేదు..కాని నోటిఫికేషన్ వస్తూ ఉంది మెసెంజర్ సింబల్ మీద ..కొన్ని రోజుల తరువాత నా స్నేహితురాలు నా ఇన్బాక్స్ కి తన ఒక మెసేజ్ పంపాను అని చెబితే కంప్యూటర్ ఓపెన్ చేసి ఇన్బాక్స్ కి వెళ్తే..అప్పుడు చూడటం ఆయన పంపినవి చూడటం జరిగింది
మీలాంటి అందం ఎవరితో..పోటీ పడలేదు..నాచురల్ బ్యూటిఫుల్
ఇంతవరకు ఇలాంటి అందం చూడలేదు అని అంటూ నా పాత ప్రొఫైల్ ఫొటోలు రెండు పెట్టాడు..మీ ఫీచరే కాదు ఫ్యూచర్ కూడా బావుంది అని..ఇలా ఏవోపనికిమాలిన మాటలు..
ఇంకా అయన తన నంబరు కూడా ఇచ్చి ఫ్రీ టైమ్ లో కాల్ చెయ్యమన్నాడు..అప్పటిదాకా ఆపుకున్న సహనం అప్పుడు బద్దలైంది
నేను ఆయనను అడిగింది ఇవే నా పోస్ట్ లోఒక్కదాంట్లో కూడా మీకు అందం కనిపించక పోవడం చాలా విచారకరమని..అసలు ఇంతవరకు నేను రాసినవి.. పోస్ట్ చేసినవో చూస్తే నా వ్యక్తిత్వం గురించి తెలిసేదని..పెరిగిన ఆడపిల్లలు ఉన్న మీకు ఒకవేళ వారికి ఇలాంటివే ఎవరైనా అర్దం పర్దం లేని చెత్త మెసేజెస్ పంపితే అప్పుడు మీకు అంగీకారమేనా అని..అసలు ఎంత ధైర్యం ఉంటే నంబరు ఇచ్చి మాట్లాడ మంటారు అని..
అసలు సిసలు అందం గురించి మాట్లాడే మీకు అసలు మనిషి అందం ఎక్కడ దాగుందో తెలుసా అని అడిగాను
ఎవరి ప్రవర్తన ఆడవారి పట్ల మర్యాద పూర్వకంగా ఉంటుందో వారే నిజమైన అందం కలిగిన వారు
ఎవరిైతే సాటి మనుషుల పట్ల జీవుల పట్ల ఆత్మీయత కరుణ తో మెలగగలరో వారే అసలైన అందం కలవారు
ఎవరైతే జీవిత ఆటుపోట్లని ఒడిదుడుకులని తమ సంకల్ప బలంతో ఆశాదృక్పధం తో ఎదుర్కుంటారో వారే అసలైన అందం కలిగిన వారు
సమయం ఎన్ని పరీక్షలు పెట్టినా వెరవకుండా దృడచిత్తం తో నిలబడి వీలున్నవరకు ఇంకొకరి బాధను పొగొట్టడానికి యత్నించేవారే అసలైన అందం కలవారు..
కొంచెం ఇంగితజ్ణానం బుద్ది ని అతనికి ప్రసాదించమని ఆ దేవుని కూడా ప్రార్దించాను
ఒక్క విషయం చెప్తాను...ఎవరైనా ఆడవారు మీ రిక్వెస్ట్ ఓకే చేసారంటే పని పాట లేకుండా మీతో చెత్తకబుర్లు చెప్పడానికి ఐతే కాదు వారు ఇంటి బయట పనులు పిల్లలు ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నారు..కొంత విజ్ఞానం కోసం కొంత ఆత్మీయత కోసం ఇంకొంత తమ మనోభావాలకు రూపం ఇవ్వటం కోసం కారణం ఏదైనా కాని అది వారు మిగితా తమ భాద్యతలను నిర్వర్తించిన తర్వాతే ఇక్కడ ఉన్నారు.
ఒకవేళ ఎవరైనా ఆడవారు మీకు రిక్వెస్ట్ పంపించి ఉంటే అది కేవలం మీ రాత లేదా మీ గీత లేదా మీరు చేసిన మంచి పని గురించి చూసి..కావచ్చు మీ వ్యక్తిత్వాన్ని మెచ్చి గౌరవించి అలా పంపి ఉండవచ్చు ..ఒకవేళ మీ పోస్ట్ లకు స్పందించి ఎమోజీ ఇస్తే అది మీ పోస్ట్ కు భావించండి మీకు కాదు..
మీరు ఇతరుల మీద పనికిమాలిన ప్రేమ వలకపోసే బదులు ఇంటిలో మీకు అన్నింట అండదండంగా ఉంటూ సమకూర్చి ఇస్తున్న మీఇంటి మహాలక్ష్మి ని ప్రేమగా పలుకరించండి..చిన్నా చితకా అర్దం పర్దం లేని ఇంకొకరి పోస్ట్ లకే ఆహా ఓహో అని పొగడటం తగ్గించుకుని సహధర్మచారిణి చిన్న చిన్న త్యాగాలను శ్రమను గుర్తించి ఆమెను అభినందించండి.
బయట వారికి శుబోదయం శుభరాత్రి చెప్పడం...తిన్నారా పడుకున్మారా అడగడం లో ఉన్న శ్రద్ద మన పెద్దవారు పిన్నల వద్దకు వెళ్లి అదే అడిగితే చాలా బావుంటుంది.
ఏ స్త్రీకైనా గౌరవమే సర్వస్వం అది మీరు ఇవ్వగలిగితే అంతకన్నా విలువైన బహుమతి లేదు..తద్వారా మీరు ఆమె నుండి మనఃపూర్వక గౌరవమన్ననలు పొందవచ్చు..అలాంటి మన్ననలు పొందడం మీకే కాదు మీకుంటుంబానికి క్షేమం చేకూరుస్తుంది..
~ Smt.Mythili Chirumaamilla ~

No comments:

Post a Comment