Sunday, 23 December 2018

రైతు

రైతు

అలుపెరుగని అలవై నీవు
సలుపెరుగని శిలవై నీవు ||

సుమంలో తావిగ నీవు
కుసుమంలో మధువుగ నీవు ||

నిక్షేపాల్లో నిశానీ నీవు
నింగికెగసిన కిరీటి నీవు ||

మబ్బుల మాటున చినుకూ నీవు
పుడమిన దాగిన పుత్తడి నీవు ||

ఆకలి నీవు, ఆర్తీ నీవు
కడుపునిండిన తృప్తీ నీవు ||
............. సువర్ణ సుసర్ల



No comments:

Post a Comment