Friday, 21 December 2018

దత్త జయంతి

దత్త జయంతి
దత్తాత్రేయడు - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతార మూర్తి

దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం
దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గుర చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, షిర్డి సాయిబాబా చరిత్రం, శ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.

No comments:

Post a Comment