Saturday 29 December 2018

JAI GURUDATTA

JAI GURUDATTA

శ్రీ మాణిక్ ప్రభు - మారుతి !!
చాలకా పుర సమీపమున
నొక భీకర అరణ్యమున
మారుతి దేవాలయముబు కలదు !
అచటి మారుతి మహోగ్ర రూపి !
పూజారులు పెందల కడనే
పూజను ముగించి
తమ నిజ గృహములకు
వెడలేడివారు !
రాత్రి ఎవ్వరును అచ్చోట
నిద్రించ సహసించే వారు కారు !!
ఒకానొక దినమున పూజారి
గుడి తలుపులు తెరువగా
అచటి మారుతి తలపై
గుడ్డల మూట కనబడెను !
మూట విప్పి చూడగా
కాలి జొళ్ళ జత, కొన్ని బట్టలు
అందు కలవు !!
సమీపమున ఒక పాతిక [25]
సంవత్సరములు గల యువకుడు
గుర్రుపట్టి గాడముగా నిద్రించు చుండెను !
పూజారి ఆతనిని లేపి
ఈ వస్త్రపు మూట నీదా యని యడిగెను !!
అంత ఆ యువకుడు,
ఈ ప్రదేశంలో దొంగల భయ ముండుట వలన
జాగ్రత్తగా భద్ర పరచుమని మారుతి
కిచ్చితినని అమాయకంగా తెలిపెను !!
పూజారి ఊగ్రుడై కర్ర తీసుకొని
ఆ యువకుని గోట్టసాగెను !
మారుతి తన స్థలమున
గజ గజ వణికేను !!
చిత్రం ! భళారే విచిత్రం !
మారుతి మెడలోని పూలమాల
ఆ యువకుని గళమును అలంకరించెను !
మారుతి దేహముపై నున్న
వస్త్రము ఆతనిపై కప్పబడెను !
ఆ పూజారి అచ్చెరు వొందెను !!
ఎవరు శ్రీ రాముడో !
ఎవరు శ్రీ కృష్ణుడో !
ఎవరు శ్రీ విష్ణువో !
ఎవరు శ్రీ దత్తుడో !
వారే కలి యుగమున
శ్రీ మాణిక్ ప్రభువని తెలుసుకొని,
ఆ పూజారి పాదాక్రంతుడయ్యే !!
శ్రీ ప్రభు ఆతనిని అనుగ్రహించే !!

No comments:

Post a Comment