Tuesday 18 December 2018

గోదాదేవి,

తులసీవనాన లభించిన అపర జానకీదేవి,
విష్ణు చిత్తు ని ఇంట పెరిగిన శ్రీదేవి ఈ గోదాదేవి,
సుందర నయనాలు గల అతిలోక సుందరి,
ముల్లోకాల కానరాదు ఇంతటి సౌదర్యవతి,
తండ్రి చెప్పిన కధలు విని , ఆ దేవదేవు ని వలచి,
నిత్యం తాను ధరించిన మాలలర్పించి ,
తిరుప్పావై రచించి ఆ దేవదేవు ని కర్పించి,
ఆ రంగనాధు ని హృదయం లో స్థానం సంపాదించి,
సాక్షాత్ ఆ పరంధాముడి నే కళ్యా ణ మాడిన అయోనిజ!!!
కృష్ణ ప్రేమ ను గానరూపంలో వివరించి ,
శాస్త్ర రహస్యాలను తన పాటల్లో పొందుపరచి,
లోకానికి కృష్ణ తత్వం బోధించెను!!!
మాలధారి యైన గోదాదేవి సమేతం గా జరిగె బ్రహ్మోత్సవం,
చూసి తరించాలే గానీ వర్ణించిలేము ఆనాడు శ్రీనివాసుని వైభోగం!!!!!
......... !సువర్ణ సుసర్ల

No comments:

Post a Comment