Tuesday, 25 December 2018

అరుదైన భక్తి సాహిత్యం ఆమె సొంతం

*****  డెంకణీకోట శ్రీమతి జయలక్ష్మి *****
అరుదైన భక్తి సాహిత్యం ఆమె సొంతం
***************************
భాష మరుగున పడితే సంస్కృతి మరుగున పడిపోతుంది.భాషతో పాటు భక్తి మరుగునపడిపోతే జాతి నశించిపోతుంది.అందుకే దేవతలు సైతం  ఈ భాషా , భక్తి వికాసము కోసమే వాగ్రూపయగు సరస్వతీ దేవిని నిత్యం స్తుతిస్తారు.
కేవలం మూడవ తరగతి మాత్రమే చదివి  బాల్యం నుండి తన తుది శ్వాస విడిచేవరకు అనగా తన 96 వ సం.వరకు భక్తి సాహిత్యాన్ని తెలుగు,తమిళం,కన్నడ,సంస్కృతం లో కీర్తనలు,పద్యాల రూపం లో అందించిన ఒక   సరస్వతీ స్వరూపాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను ..వారి పేరు స్వర్గీయ డెంకణీకోట శ్రీమతి జయ లక్ష్మి గారు.వీరు నాకు ముఖపుస్తకం ద్వారా పరిచయం అయిన శ్రీ  Narasimhan Venkataraamaiah గారి తల్లి గారు.వీరు పూర్వం తెలుగు దేశాన ఉన్నప్పటికి తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసురులో స్థిరపడి తన 93 ఏళ్ళ వయసువరకు వివిధ భక్తి రచనలను ఎన్నో చేశారు.వాస్తవానికి శ్రీమతి జయలక్ష్ముమ్మగారు తెలుగు భాష కూడా నేర్వని నిరక్ష్యరాస్యురాలు. మరి భగవంతుని కృప ఆమెపై మెండుగా ఉండటం వల్ల 18 వ శతాబ్దం నాటి సాకమ్మ రామాయణం లోని యక్షగానాన్ని ఆపోసనపట్టి శ్రీ రామకథామృత అను పుస్తకాన్ని రచించారు.
ఇంకా శ్రీమతి జయలక్ష్మి గారు శ్రీ వేంకటేశ్వవరుడిని భక్తి పారవశ్యంతో కీర్తిస్తూ అశువుగా తేటగీతి,సీస పద్యాల రూపం లో అనేక కీర్తనలు, ఎన్నో స్తోత్రాలను రచించారు.ఆ అరుదైన భక్తి సాహిత్యాన్ని ద్వాదశ శతమణిమాలలు అను  677 పేజీల పుస్తక రూపంలో మరియు అమ్మగారు స్వయంగా పాడిన   భక్తి కీర్తనలను సీడీల రూపంలో  ఎంతో వ్యయప్రయాసలతో కొద్ది నెలల క్రితమే వారి కుమారులు విడుదల చేశారు.తిరుమల శ్రీవెంకటేశ్వర సుప్రభాతం పధ్ధతిలో సాగిన ద్వాదశ శతమాణిమాలలు , ద్వాదశ శతకాలుగా వెలువడిన ఈ తెలుగు రచన   నిత్య పారాయణ గ్రంథం లా తమిళనాడులో నేడు  కొనియాడబడుతోంది.
ఈ  పుస్తకాలు, సీడీలకు  సంబంధించిన  వివరాలు....వీటిని కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా అందుకోవటానికి వాటి ఖరీదు మరిన్ని వివరాలకు ఈ క్రిద తెలియపరచిన శ్రీమతి జయలక్ష్మి అమ్మగారి కుమారులకు Whatsapp  చేయగలరు .

1. Sri V Rama Murthy ,whatsapp # 9283112057
2.Sri Narasimhan Venkata Ramaiah # 8608086821
3.Sri V Srinivasan # 8884777089
 ప్రతులు,సీడీలు కావలసినవారు ఈ చిరునామాలో కూడా సంప్రదించవచ్చు:
# Sri V Srinivasan
  B 86,SIPCOT Housing Colony
  Nera Darga
  HOSUR - 635 126
  Tamil Nadu
  South India


***** 1. శ్రీహరిని ఉద్దేశించి శ్రీమతి జయలక్ష్మి గారు రాసుకున్న కవిత  *****
// దొరకినాడు దేవదేవుడు ధరణి పాలకుండు హరీ
తనదు మహిమ నాల్గుదిశల తెలుప మనమునందు తలచి
ఆశనిచ్చి పాడుటకు అతివ నాదు కోర్కె వలను
చిత్తమనెడి ప్రమిదలో ప్రయత్నమనెడి ఆజ్యమునచి
పట్టుదలయనేటి పెద్దవొత్తి జేసినాను
అతని మహిమ నామములను ఆత్మనెఱిగి పలికినాను
కలముపట్టి వ్రాయుటకు కరుణ చూప కోరినాను //
***************************************
****** తల్లి శారదా మాతపై శ్రీమతి జయలక్ష్మి గారు రాసిన సీస పద్యం *****
// శారద నిన్ను చాలవేడద నేను
   నీరజోద్భవరాణి నిఖిలజనని
   నూత్నముగ హరిని నుతియించి పాడగ
   వరములియ్యుము కీరవాణి నాకు
   కవులకాంక్షయు తీర్పు కామధేనువు నీవు
   కామిత ఫలమిమ్మి కలికి నాకు
   వ్రాయపూనితికాని మతికేమి తోచదు
   దివిజపూజిత నీవె దిక్కునాకు //
************************************

మాట పలుకు బుధ్ధి జ్ఞానాన్ని ప్రసాదించే చదువుల తల్లులందరికీ ఈ పోస్ట్ భక్తితో











No comments:

Post a Comment