Wednesday 12 December 2018

దత్తాత్రేయుడు



దత్తాత్రేయుడు
సం: 1911లో దత్త జయంతినాడు సాయంత్రం 5 గంటలకు బాబా అకస్మాత్తుగా "నేను ప్రసవవేదన భరించలేకున్నాను" అని కేకలేసి భక్తులందరినీ మశీదునుండి తరిమివేశారు.
ొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి పిలచారు అలనాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తాదాత్మ్యం చెందారని భక్తులనుకున్నారు.
అప్పుడు బల్వంత్ భోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు.
అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన యిద్దరు భక్తులలో ఒకరినుండి రూ. 15/- లు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా, కానీ రెండవ భక్తుడిచ్చిన దక్షిణ తీసుకోలేదు అందుకు కారణమడిగిన శ్యామాతో బాబా యిలా చెప్పారు.
"శ్యామా, నీకేమీ తెలియదు నేనెవరినుండీ ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావలసిన ఋణాన్ని అడిగి తీసుకుంటుంది"
ఇల్లు కుటుంబము లేని నాకు పైకమెందుకు?.
అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా యిస్తానని దత్తాత్రేయ స్వామికి మ్రొక్కుకున్నాడు.
త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది అతని 
మొదటి నెల జీతం రూ. 15/-లు. ఇప్పుడతని జీతం రూ. 700/- లు. కష్టం గడవడంతో అతడు మొక్కును మరచాడు.
ఋణము, శతృత్వము, హత్య - వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు.
అందుకే అతని నుండి రూ. 15/- లు అడిగి తీసుకున్నాను" అన్నారు తాను మొక్కిన దత్తస్వామియే బాబా.
అలానే బాబా సాహెబ్ అనే దత్తభక్తుడు 
తన బంధువైన నానాచందోర్కర్ మాటను త్రోసివేయలేక, సం: 1900లో సాయిని దర్శించాడేగాని లోలోపల ఆయన ముస్లిం అన్న శంక వున్నది. కాని మశీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు. అంతటితో అతడు తన జీవితమంతా సాయి సేవకే అంకితం చేసాడు
.

No comments:

Post a Comment